అప్పుడే స్టీవ్ స్మిత్‌కు మళ్లీ కెప్టెన్సీ.. అది అవకాశం ఉంటేనే!

సిడ్నీ: ఈ తరం అత్యుత్తమ సారథుల్లో ఒకడిగా నిలిచిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్.. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో కెప్టెన్సీని పొగొట్టుకున్నాడు. 2018 మార్చిలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి అడ్డంగా దొరికి పోయిన స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిషేధం విధించింది. ఈ ఉదంతం యావత్ క్రికెట్ ప్రపంచం ముందు ఆసీస్ ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టింది. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సీరియస్ కావడంతో సీఏ కఠిన నిర్ణయం తీసుకుంది. స్మిత్ కెప్టెన్సీ, వార్నర్ వైస్ కెప్టెన్సీలపై వేటు వేసిన సీఏ.. ఈ ఇద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించింది.

గడువు ముగిసినా..
దాంతో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్, టెస్టు కెప్టెన్‌గా టిమ్ పైన్ బాధ్యతలు చేపట్టారు. నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్‌ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా అభిమానులు అంగీకరిస్తే.. క్రికెట్ వర్గాలు ఓకే అనుకుంటేనే స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. అయితే స్మిత్ కెప్టెన్సీ నిషేధం గడువు ముగిసినా.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అతనికి ఇంకా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించలేదు. కనీసం ఆ దిశగా కూడా ఆలోచించడం లేదు.

చర్చకు కూడా రాలేదు..
భారత్‌తో జరిగే అప్‌కమింగ్ సిరీస్‌ల్లో టెస్టులకు టిమ్ పైన్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు.. వైస్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ పేరును ప్రకటించారు. భారత్‌తో తొలి టెస్టుకు ముందు పైన్ 36వ ఏట అడుగుపెడుతున్నాడు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం కెప్టెన్‌గా అతన్ని కొనసాగించేందుకే సుముఖంగా ఉంది. టిమ్ పైన్ కెప్టెన్సీ వద్దనుకుంటేనో లేదంటే.. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాకో.. స్మిత్ కెప్టెన్సీ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఉద్దేశంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది. అందుకే ఇటీవల జట్టును ప్రకటించినప్పుడు.. నాయకత్వానికి సంబంధించి స్మిత్ పేరు కనీసం ప్రస్తావనకు రాలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ ట్రెవర్ హోన్స్ తెలిపారు.

ఇప్పుడు చెప్పలేం..
స్మిత్ మళ్లీ కెప్టెన్ కాలేడా..? అని ప్రశ్నించగా.. ‘అది ఇప్పుడే చెప్పడం కష్టం. కెప్టెన్సీ కోసం అతను పోటీలో ఉండవచ్చు. కొత్త కెప్టెన్‌ను ఎన్నుకోవాలని అనుకుంటే.. అప్పటి పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది. టిమ్ పైన్ ఇంకా ఆడుతున్నాడు. అతని కెప్టెన్సీలోనే జట్టు ముందుకెళ్లనిద్దాం'అని హోన్స్ చెప్పుకొచ్చాడు. నిషేధానంతరం పునరాగమనం చేసిన స్మిత్ అదరగొట్టాడు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ అద్భుత బ్యాటింగ్‌లో సూపర్ విక్టరీలను అందించాడు. కంకషన్‌తో గాయపడ్డా.. కోలుకొని యాషెస్ టైటిల్ కాపాడుకోవడం కీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications