అందుకే తెలుగు క్రికెటర్లకు ఐపీఎల్‌లో అవకాశం రావడం లేదు: ఎమ్మెస్కే ప్రసాద్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సూపర్ స్టార్ల, అంతర్జాతీయ క్రికెటర్ల ఆటే కాదు... అప్పటి వరకు అనామకులుగా కనిపించిన వారిని కూడా హీరోలుగా మార్చేస్తుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించే భారత యువ ఆటగాళ్లకు ప్రతీ ఏటా లీగ్ అలాంటి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదిక మీద సత్తా ప్రదర్శించి చెలరేగితే అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకోవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశం తెలుగు క్రికెటర్లకు మాత్రం అంతగా వరించడం లేదు. ఈ సీజన్ ఐపీఎల్‌లో మన తెలుగు రాష్ట్రల క్రికెటర్లు ముగ్గురంటే ముగ్గురే బరిలో దిగుతున్నారు.

ఆ ముగ్గురిలోనూ ఒక్కడే..
ఇందులో అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ ఇప్పటికే పలు సీజన్లు ఆడగా హైదరాబాద్ కుర్రాడు బావనక సందీప్ తొలిసారి ఎంపికయ్యాడు. కానీ ఇప్పటి వరకు సందీప్, సిరాజ్‌లకు ఆడే అవకాశమే రాలేదు. రాయుడు ఒక్కడే కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతను కూడా గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఇక భారత టెస్ట్ బ్యాట్స్‌మన్ హనుమ విహారీ గత సీజన్లలో ఆడినప్పటికీ.. సంప్రదాయక ఆటగాడిగా ముద్ర పడటంతో వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తికనబర్చలేదు. అలాగే ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. అండర్-19 ప్లేయర్ తిలక్ వర్మకు కూడా అదృష్టం వరించలేదు. తెలుగు క్రికెట్ అసోసియేషన్‌ల వైఫ్యలమో ఏమో కానీ మన ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం దేవుడెరుగు.. కనీసం ఐపీఎల్‌కు కూడా ఎంపికవ్వడం లేదు.

ఆటలో నిలకడ లేకనే..
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని తెలుగు కామెంటేటర్ల ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. యాష్ ట్యాగ్ స్టార్‌ను అడుగు కాంటెస్ట్‌లో ‘ఐపీఎల్‌లో తెలుగు క్రికెట్లరకు ఎందుకు అవకాశాలు అందుకోలేకపోతున్నారు'అని ప్రశ్నించాడు. ఈ క్వశ్చన్‌ను కామెంట్రీ బాక్స్‌లో ఉన్న కళ్యాన్.. సహచర కామెంటేటర్, టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ముందు ఉంచగా.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడలేమి ప్రదర్శనలతోనే అవకాశాలు అందుకోలేకపోతున్నారని తెలిపాడు.
‘కొత్త ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు దేశవాళీ టీ20 లీగ్ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీని పరిశీలిస్తాయి. ఈ లీగ్‌లో స్థిరంగా రాణించేవారిని ఎంచుకుంటాయి. అయితే తెలుగు ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో రాణిస్తున్నా.. నిలకడలేమితో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ముస్తాక్ అలీ ట్రోఫీలో అంతా విఫలమయ్యారు. ఈ కారణంగానే ఐపీఎల్‌లో మన ఆటగాళ్లు అవకాశాలు అందుకోలేకపోయారు'అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చాడు.

ఆటగాళ్ల గురించి తెలియకపోవడం..
అంతకుముందు టీమిండియా మాజీ క్రికెటర్ కమ్ తెలుగు కామెంటేటర్ వేణు గోపాల్ రావు మాట్లాడుతూ.. తెలుగు ఆటగాళ్ల గురించి తెలియకపోవడం వల్ల అవకాశాలు రావడం లేదన్నాడు. మన రాష్ట్రానికి చెందిన సీనియర్ ఆటగాళ్లు ఆయా టీమ్‌మేనేజ్‌మెంట్‌లో ఉంటే అవకాశాలు దక్కేవని, ప్రారంభంలో తనతో సహా చాలా మందికి అవకాశం దక్కిందని గుర్తుచేశాడు.
కింగ్స్ పంజాబ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉండటంతో ఆ జట్టులో మొత్తం నలుగురు కర్ణాటక ఆటగాళ్లున్నారని ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. నార్త్ ఇండియాలో జరిగే టోర్నీల్లో పాల్గొని రాణిస్తే ఆటగాళ్లకు గుర్తింపు లభిస్తుందని చెప్పాడు. తెలుగు ఆటగాళ్లకు అవకాశాలు వచ్చేలా తమ వంతుగా కృషి చేస్తామన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఒక్క ఇన్నింగ్స్‌తో జీవిత సత్యం చెప్పిన రాహుల్ తెవాటియా!