
గంగూలీ ప్రోత్సాహంతో..
నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మహీ నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన ధోనీ.. ఆ మ్యాచ్‌లో అనవసర పరుగుకు ప్రయత్నించి డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం జరిగిన మూడు వన్డేల్లో 12, 7 నాటౌట్, 3 పరుగులే చేశాడు. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ.. విశాఖ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఫస్ట్ డౌన్‌లో వచ్చాడు.

సెహ్వాగ్‌తో కలిసి
ఈ మ్యాచ్ నాలుగో ఓవర్లోనే లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఔటవ్వడంతో... క్రీజులోకి వచ్చిన ధోనీ.. సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసాధారణ రీతిలో బ్యాటింగ్ చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్.. నాటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో నాలుగో వికెట్‌కు 96 పరుగులు.. రాహుల్ ద్రవిడ్‌తో 149 రన్స్ జోడించాడు.
123 బంతులు ఆడిన ధోనీ.. 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 పరుగుల చేశాడు. నాటి పాక్ దిగ్గజ బౌలర్లు మహ్మద్ సమీ, నవీద్ ఉల్ హసన్, షాహిద్ అఫ్రిదీ, మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌ను చీల్చి చిండాడాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 356 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 298 పరుగులకు ఆలౌటైంది. నెహ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ సెంచరీతో ధోనీ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ అద్భత సెంచరీతో ఆస్ట్రేలియా దిగ్గజ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 172,154 తర్వాత ధోనీ నిలిచాడు.

శ్రీలంకపై సూపర్ సెంచరీ..
ఈ సిరీస్ అనంతరం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 183 నాటౌట్‌తో గిల్ క్రిస్ట్‌ను రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం తన వన్డే కెరీర్‌లో మొత్తం 9 సార్లు మూడంకెల స్కోర్ చేసిన ధోనీ.. 50.57 సగటుతో 73 హాఫ్ సెంచరీలతో 10773 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ధోనీ.. భారత్ తరఫున 16 ఏళ్లు ఆడాడు. ఈ క్రమంలో భారత్ తరఫున 350 వన్డేల్లో 50.57 యావరేజ్‌తో 12,303 రన్స్ సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.. బెస్ట్ స్కోర్ 183 నాటౌట్. ఒక వికెట్ కూడా తీశాడు.

అందుకేనా ఈ అనూహ్య నిర్ణయం..
నిజానికి షెడ్యూల్ ప్రకారం మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ కోసం ధోనీ సిద్ధంగా ఉన్నాడు. అందరికంటే ముందే చెన్నైలో ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. ఆ సమయంలో అతను అత్యంత ఫిట్‌గానూ కనిపించాడు. ఈ లీగ్‌లో తానేంటో నిరూపించుకుని టీ20 ప్రపంచక్‌పలో ఆడాలనే భావనలో ఉన్నాడు. కానీ కరోనా ప్రభావంలో లీగ్ సెప్టెంబరుకు, పొట్టి ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ధోనీ పునరాలోచనలో పడ్డట్టున్నాడు. ఆ సమయానికి అతను 40 ఏళ్లకు చేరుకోవడంతో పాటు అంత సమయం వేచి చూడడం అనవసరమని, కుర్రాళ్లు కుదురుకునేందుకు అవకాశం కూడా ఇచ్చినట్టవుతుందని ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications

బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!










