జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌కు ఎంఎస్ ధోనీ రూ. 1800 బాకీ!

రాంచీ: మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. ఇండియన్ టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టనెంట్ కల్నల్.. ఇలా చెప్పుకంటే పోతే మరెన్నో.. ఏ రకంగా చూసినా ఫైనాన్షియల్‌గా చాలా బలమైన వ్యక్తి. ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్. అతని నికర ఆదాయం సుమారు రూ.700 కోట్లు అని టాక్. కానీ తాను ప్రాతినిధ్యం వహించే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ)కు మహీ రూ. 1800 బకాయి పడ్డాడట. మెంబర్‌షిప్ ఫీజుకు సంబంధించి ఆ డబ్బు ఇంకా చెల్లించలేదట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ విషయం తీవ్ర దుమారాన్నే రేపింది.

జీఎస్టీ రూ.1800 చెల్లంచలేదు..
2019-20 ఫైనాన్షియల్ ఇయర్‌కు గాను జేఎస్‌సీఏ విడుదల చేసిన వార్షిక రిపోర్ట్‌తో ధోనీ రూ.1800 బాకీ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి జేఎస్‌సీఏలో శాశ్వత సభ్యత్వం కోసం గతేడాది అక్టోబర్ 31న ధోనీ రూ.10,000 చెక్కు రూపంలో చెల్లించాడు. అసోసియేషన్‌కు చెందిన వ్యక్తి ధోనీ ఇంటికి వెళ్లి ఆ చెక్కు తీసుకొచ్చాడు. అయితే, జీఎస్టీతో కలిపి ధోనీ మొత్తం రూ.11,800 చెల్లించాల్సి ఉందట. ఇందులోని ఆ రూ.1800నే ధోనీ నుంచి రావాల్సిన బకాయిగా జేఎస్‌సీఏ చూపించింది.

ఫ్యాన్స్ చందాలు వేసుకుని..
ధోనీ బాకీ ఉన్నాడనే విషయం తెలియగానే పలువురు ఫ్యాన్స్, స్కూల్ పిల్లలు కలిసి చందాలు వేసుకుని.. ఆ మొత్తానికి డీడీ తీసి జంషెడ్‌పూర్‌లోని జేఎస్‌సీఏ ఆఫీస్‌లో అందజేసేందుకు వెళ్లారు. అయితే మహీ అనుమతి లేకుండా ఆ డీడీని స్వీకరించలేనని అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ షాయ్ వారిని వెనక్కి పంపారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు మాటల యుద్దం నడిచింది. తమ ఆరాధ్య క్రికెటర్‌కు చెడ్డ పేరు రావడాన్ని మహీ ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు. జేఎస్‌సీఏ నిప్పులు చెరుగుతున్నారు.

అంతర్గత వ్యవహారం..
జేఎస్‌సీఏ వార్షిక రిపోర్ట్‌లో 31 మార్చి 2020 వరకు జరిగిన లావాదేవీలు మాత్రమే ఉంటాయి. ధోనీ ఆ తర్వాత ఆ రూ.1800 చెల్లించాడా? లేదా? అనేది తెలియదు. దీనిపై అసోసియేషన్ సెక్రటరీ సమాధానం ఇవ్వడం లేదు. అది తమ అంతర్గత వ్యవహారమని, బయటపెట్టలేమని తేల్చి చెప్పాడు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

అభిమానుల నిరసనలతో..
తొలుత ధోనీని జేఎస్‌సీఏ గౌరవ సభ్యుడిగా గుర్తించగా... అభిమానుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో జేఎస్‌సీఏ ధోనికి జీవితకాల సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించింది. అసోసియేషన్ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయాన్ని ఏజీఎమ్‌లో ఆమోదించారు. కానీ, విచిత్రమేమిటంటే, సభ్యుల జాబితాను తన వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి జేఎస్‌సీఎ చాలా సమయం తీసుకుంది, చివరకు ఈ జూలైలో చేసింది.
England vs Australia: ఓయ్ బట్లర్ దీనికా రివ్యూ తీసుకునేది.. నువ్వు గొప్పోడివి సామి.! (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications