Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ రిటైర్మెంట్ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ ఫైర్.!

MS Dhonis fans, CSK start social media trend slamming rumours of his retirement

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబతున్నాడనే వార్త బుధవారం హల్‌చల్ చేసింది. #DhoniRetires అనే ట్యాగ్ ట్విటర్‌లో విపరీతంగా ట్రెండ్ అయింది. అయితే ఈ వార్తలపై చిర్రెత్తుకుపోయిన ధోనీ సతీమణి సాక్షిసింగ్ తీవ్రస్థాయిలో మండిపడింది. అవన్నీ పుకార్లేనంటూ.. లాక్‌డౌన్‌లో జనాలకు ఉన్న మతి పోయినట్టుందని ఘాటుగా ట్వీట్ చేసింది.

లాక్‌డౌన్‌‌తో జనాల మతిపోయింది..

‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్ ప్రజలను పిచ్చొళ్లను చేసిందని అర్థమైంది'అని ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది. ఇన్ని రోజులు కూల్‌గానే ఉన్న సాక్షి.. ఈసారి మాత్రం ఫైర్ అయ్యారు. తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో సహనం కోల్పోయి కోపంలో సాక్షి అలా ట్వీట్‌ చేశారని కొందరు అంటున్నారు.

మండిపడ్డ చెన్నై సూపర్ కింగ్స్..

ధోనీ రిటైర్మెంట్ పుకార్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా మండిపడింది. #DhoniNeverTires యాష్ ట్యాగ్‌‌తో ఆ వార్తకు కౌంటరిచ్చింది. ధోనీకి సంబంధించిన విషయాలను సూపర్ కొటేషన్‌లతో షేర్ చేస్తూ మహీ రిటరైర్ అవ్వడని పేర్కొంది.

డిసెంబర్ 3 నుంచి భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్!

కౌంటర్‌గా #DhoniNeverTires ట్రెండ్..

ఇక చెన్నై సూపర్ కింగ్స్ పిలుపుతో ధోనీ అభిమానులు #DhoniNeverTires ట్రెండ్ చేస్తున్నారు. ‘నువ్వెప్పుడు జనసమూహ కోసం ఆడలేదు.. దేశం కోసం ఆడావ్.. లవ్ యూ తాళా'అంటూ కామెంట్ చేస్తున్నారు. ధోనీ ఎప్పటికీ రిటైర్ అవ్వడని, త్వరలో రీ ఎంట్రీ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఐసీసీ బెస్ట్ వన్డే కెప్టెన్‌గా నిలిచిన ధోనీ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని కొనియాడుతున్నారు. ధోనీ చెప్పిన అద్భుత విషయాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు.

ప్రశ్నార్ధకంలో మహీ భవిష్యత్..

ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 11 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేకపోవడం, ఎలాంటి క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది.

అయినా మహీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఎన్నడు లేనివిధంగా చెమటోడ్చడు. ఇక రీఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ధోనీ ఉన్నట్లు తమకు అనిపించిందని ఆ జట్టు సహచర ఆటగాళ్లు తెలిపారు.

Story first published: Thursday, May 28, 2020, 18:00 [IST]
Other articles published on May 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+