Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డిసెంబర్ 3 నుంచి భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్!

India Test series against Australia to start from December 3: Reports

మెల్‌బోర్న్: కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ పునరుద్దరణ చర్యలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా భారత్ జట్టు‌ పర్యటనకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే తమ ప్రభుత్వ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న సీఏ.. షెడ్యూల్ కూడా ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇక అక్కడి మీడియా కథనాల మేరకు ఈ ఏడాది డిసెంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుందని తెలుస్తోంది.

ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మొదట జరగనున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా నాలుగు వేదికలను సిద్దం చేసిందని, ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖారారైందని 7న్యూస్.కామ్.ఏయూ పేర్కొంది. త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా తమ 2020-21 షెడ్యూల్ వివరాలను ప్రకటించనుందని రాసుకొచ్చింది.

డిసెంబర్ 3న తొలి టెస్ట్..

డిసెంబర్ 3న తొలి టెస్ట్..

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ ఐకానిక్ గబ్బాలోని బ్రిస్బెన్ వేదికగా డిసెంబర్ 3న ప్రారంభం కానుందని, మిగతా మూడు మ్యాచ్‌లు అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీ వేదికగా జరగనున్నాయని తెలిపింది. ఈ ప్రణాళికల్లో అతిథులకు క్వారంటైన్ హబ్ కానీ బయో-బబుల్‌ కానీ లేనట్లు సమాచారం.

‘‘డిసెంబర్ 3న బ్రిస్బేన్ వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్. డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్ట్. ఆ తర్వాత జనవరి 3న న్యూఇయర్ టెస్ట్ జరుగనుంది'' అని పేర్కొంది. అంతేకాక.. కొద్ది రోజుల క్రితం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోరిన విధంగా.. అడిలైడ్ వేదికగా నిర్వహించనున్న రెండో టెస్ట్‌ను డే అండ్ నైట్ ఫార్మాట్‌లో నిర్వహించనుందని తెలిపింది.

అదుపులో కరోనా..

అదుపులో కరోనా..

ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 7వేల పాజిటీవ్ కేసులు నమోదవ్వగా.. 6500 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అప్పటి పరిస్థితులను బట్టి ఫ్యాన్స్‌ను అనుమతించాలా? లేదా అనేదానిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోనుంది.

‘ఆస్ట్రేలియాలో కరోనా అదుపులోకి వచ్చింది. ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండా భారత్‌తో సిరీస్ నిర్వహించే అవకాశం ఉంది. లేకుంటే ఒకే నగరంలో పూర్తి పర్యటనను కొనసాగించే చాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫ్యాన్స్‌ను అనుమతిస్తే ఎంతమందిని పంపిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.'అని సదరు మీడియా సంస్థ తమ కథనంలో రాసుకొచ్చింది.

కోహ్లీసేన చారిత్రాత్మక విజయం..

కోహ్లీసేన చారిత్రాత్మక విజయం..

2018-19 పర్యటనలో కోహ్లీసేన 2-1తో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన జట్టుగా రికార్డుకెక్కింది. మరోసారి అదే విజయాన్ని రిపీట్ చేయాలని భావిస్తోంది. అయితే అదంతా సులువైన విషయం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు స్మిత్, వార్నర్ లేకపోవడంతో భారత్ విజయం సులువైందని కానీ, ఇప్పుడు వారితో గట్టి సవాల్ ఎదురు కానుందని చెబుతున్నారు.

Story first published: Wednesday, May 27, 2020, 20:56 [IST]
Other articles published on May 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+