ఐపీఎల్‌పై ఎంఎస్ ధోనీ షాకింగ్ నిర్ణయం!
సీఎస్కే దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై మరోసారి చర్చ ప్రారంభమైంది. రాబోయే ఐపీఎల్ సీజన్లలో ఆయన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించుకుని కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతారని వార్తలు వచ్చాయి. అయితే ధోనీ అలాంటి పాత్రను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు సీఎస్కే మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ సంచలన విషయాలు వెల్లడించారు.
ఫుల్ టైమ్ వికెట్ కీపర్‌గానే మైదానంలోకి!
తమ వ్యక్తిగత సంభాషణలో ధోనీ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పేర్కొన్నారు. "నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి దిగను.. ఆడతానంటే ఫుల్ టైమ్ వికెట్ కీపర్ గా 20 ఓవర్ల పాటు మైదానంలోనే ఉంటానని ధోనీ నాతో చెప్పారు" అని బద్రీనాథ్ వెల్లడించారు. పెరిగిన వయస్సు, మోకాళ్ల నొప్పుల దృష్ట్యా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనీకి చాలా మేలు చేస్తుందని, కానీ ఆయన తన శైలికి భిన్నంగా స్టేడియంలో సగం సగం బాధ్యత తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

సీఎస్కేకు ప్లాన్ మారాల్సిందేనా?
ఈ నిర్ణయంతో సీఎస్కే యాజమాన్యానికి పెద్ద సవాలు ఎదురుకానుంది. ఎంఎస్ ధోనీ 16వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి అంతకు ముందు 20 ఓవర్లు వికెట్ కీపింగ్ చేయడం ఆయన శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆయన ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడితే వ్యూహాత్మకంగా చెన్నై జట్టుకు చాలా ప్లస్ అవుతుందని.. అయితే ధోనీ మాత్రం పూర్తి స్థాయి ఆటగాడిగానే ఉండాలని భావిస్తున్నారని చెప్పారు.
2027 ఐపీఎల్‌లో ధోనీ కనిపిస్తాడా?
సీఎస్కేకు ఐదు ఐపీఎల్ ట్రోపీలు అందించిన ధోనీ.. 2024 సీజన్ ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడనని తెగేసి చెప్పడంతో రాబోయే 2027 ఐపీఎల్ సీజన్ నాటికి ఆయన ఫిట్‌నెస్ ఎలా ఉంటుందనే దానిపైనే ఆయన రీఎంట్రీ ఆధారపడి ఉంటుంది. 20 ఓవర్ల పాటు కీపింగ్ చేసే సత్తా ఆయన శరీరానికి ఉంటేనే ఆయన మళ్లీ పసుపు జెర్సీలో కనిపించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

