
ఇప్పుడు చెక్ చేయాలి..
‘ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం ధోనీది. అందరినీ సమానంగా చూస్తూ నిజాయతీగా ఉంటాడు. మా ఫోన్స్ ఎందుకు తీయవని గతంలో అతడిని అడిగాను. అయితే తాను రిటైరయ్యాక ఎవరుచేసినా మొదటి రింగ్ పూర్తి కాకుండానే ఫోన్ తీస్తానని ఓసారి నాకు, మునాఫ్ పటేల్‌కు హామీ ఇచ్చాడు. ఇప్పుడు మేం అతను నిజంగా రిటైర్ అయ్యాడా? లేదా అని పరీక్షించాలి. ఇక ఆటగాళ్లు ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ సంభాషణలు ఏం భిన్నంగా ఉండవు. మేం తరుచూ మ్యాచ్‌లు, ఆటగాళ్ల గురించి సరదాగా మాట్లాడుకుంటూనే ఉంటాం.' అని చెప్పాడు.

ధోనీలాంటి ఆటగాడు దొరకడు..
క్రికెట్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఎక్కడా ధోనీలాంటి ఆటగాడు దొరకడని, అతనో భిన్నమైన ఆటగాడని ఆర్పీ సింగ్ కొనియాడాడు. ‘ఒకవేళ మీరు క్రికెట్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఎక్కడా మీకు ధోనీలాంటి ఆటగాడు కనిపించడు. ఆరు, ఏడో స్థానంలో తనదైన బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన ధోనీలాంటి ఆటగాడే లేరు. ఇప్పటికే మనం బెవన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ధోనీ మాత్రం భిన్నమైన ఆటగాడు.'అని ఆర్పీ సింగ్ తెలిపాడు.

అప్పుడే ధోనీ అంటే ఏంటో తెలిసింది..
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ చెప్పినట్లు చేయడంతోనే తాను పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్(0) వికెట్ తీయగలిగానన్నాడు. దాంతో మహీ అంటే సాధారణ ఆటగాడు కాదనే విషయం తెలిసొచ్చిందని పేర్కొన్నాడు. ‘2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ అంటే ఏంటో తెలిసింది. అతడో ప్రత్యేకమైన ఆటగాడనిపించింది. ఆ టోర్నీలో అతడు బ్యాటింగ్‌తో అదరగొట్టకపోయినా ప్రతీ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో కమ్రాన్ అక్మల్ బ్యాటింగ్‌కు వచ్చాక క్రీజులో కాలు కదపడం లేదని ధోనీ నాకు చెప్పాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే అక్మల్‌ను బౌల్డ్ చేయవచ్చని సలహా ఇచ్చాడు. అలానే బౌలింగ్ చేయడంతో కమ్రాన్ బౌల్డ్ అయ్యాడు. ఆ క్షణమే ధోనీ అసాధారణ ఆటగాడు అనిపించింది'అని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.

ధోనీ ఫస్ట్‌టైమ్ అక్కడ కలిసా..
ధోనీని తొలి సారి దేవధర్ ట్రోఫీ సందర్భంగా కలిసానని ఆర్పీ సింగ్ గుర్తు చేసుకున్నాడు. 'దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీ సందర్బంగా తొలిసారి ధోనీని కలిసాను. ఈస్ట్ జోన్‌లో లేనప్పటికి అతను అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత బెంగళూరు క్యాంప్‌లో కలుసుకున్నాం. కాకపోతే అప్పటికే ధోనీ గురించి నాకు తెలుసు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో అనధికారికంగా చాలా టోర్నీలు జరుగుతాయి. గ్వాలియర్‌లో ధోనీని ఫస్ట్ టైమ్ కలిసే నాటికే అతనికి మంచి పేరుంది. అతను చాలా రిజర్వ్‌డ్ పర్సన్. అతని చుట్టు ఉన్న వ్యక్తులతోనే తప్పా మిగతా వారితో పెద్దగా మాట్లాడడు. అతి తక్కువ మందితో ఉండటానికి ఇష్టపడుతాడు. ఇండోర్స్ ఎక్కువ గడపడం అతనిపై ప్రభావం చూపింది. అతని ప్రపంచంలోనే వీడియో గేమ్స్ ఆడుకుంటూ సంతోషంగా ఉంటాడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటారనే విషయాన్ని కూడా నమ్మడు.'అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.
CPL 2020: కరీబియన్ గడ్డపై అదరగొడుతున్న సన్‌రైజర్స్ బౌలర్.. లీగ్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా అరుదైన ఘనత!


Click it and Unblock the Notifications












