Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: కరీబియన్ గడ్డపై అదరగొడుతున్న సన్‌రైజర్స్ బౌలర్.. లీగ్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా అరుదైన ఘనత!

CPL 2020: Mohammad Nabi creates unique record with his 5-wicket haul

ట్రినిడాడ్: బ్యాట్స్‌మెన్‌కు ఫేవర్‌గా ఉండే ధనాధన్ టీ20 ఫార్మాట్‌లో బౌలర్లు.. పై చేయి సాధించడం చాలా అరుదు.! అందులో స్పిన్నర్లుకు మరి కష్టం! ఇన్నేళ్ల టీ20 చరిత్రలో బౌలర్లు రాణించింది కూడా తక్కువే.! కానీ అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ నబీ సంచలన ప్రదర్శనతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ప్రస్తుతం కరీబీయన్ ప్రీమియర్‌ లీగ్ ఆడుతున్న ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్.. గురువారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. తద్వారా కరీబీయన్ లీగ్ చరిత్రలోనే 5 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

4 ఓవర్లు.. 15 రన్స్.. 5 వికెట్లు!

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన మహ్మద్ నబీ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దాంతో నబీ ప్రాతినిధ్యం వహిస్తున్న సెయింట్ లూసియా జౌక్స్ 6 వికెట్ల తేడాతో సునాయస విజయాన్నందుకుంది. ప్రపంచవ్యాప్తంగా (ఐపీఎల్, సీపీఎల్, బీపీఎల్, బీబీఎల్, ఏపీఎల్ 5) ఫ్రాంచైజీ లీగ్స్ ఆడిన నబీ.. ఈ ఐదు లీగ్‌ల్లో నాలుగు వికెట్ల ఘనత అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన రెండో రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. నబీ కన్నా ముందు సోహైల్ తన్వీర్ ఈ ఫీట్ సాధించాడు.

సునాయస విజయం..

సునాయస విజయం..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్.. నబీ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులు మాత్రమే చేసింది. బెన్ డంక్(33), అల్జారీ జోసెఫ్(21 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జౌక్స్ టీమ్‌లో నబీ 5 వికెట్లకు తోడుగా.. కెస్రిక్ విలియమ్స్, రకీమ్ కార్న్‌వాల్, జహీర్ ఖాన్, స్కాట్ కుగ్లెజిన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సెయింట్ లూసియా జౌక్స్... 14.4 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రకీమ్ (26), రోస్టన్ చేజ్(27), నజిబుల్లా జోర్డాన్(33) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఇమ్రాన్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. బెన్ డంక్ ఓ వికెట్ తీశాడు. రికార్డు పెర్ఫామెన్స్ కనబర్చిన నబీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

అదరగొడుతున్న సన్‌రైజర్స్ ప్లేయర్..

అదరగొడుతున్న సన్‌రైజర్స్ ప్లేయర్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌తోనే ఫ్రాంచైజీ లీగ్ కెరీర్‌ను ప్రారంభించిన నబీ అనతికాలంలోనే గొప్ప క్రికెటర్‌గా గుర్తింపుపొందాడు. ఐపీఎల్‌లో 2017 సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్.. సహచర ఆటగాడు రషీద్ ఖాన్‌తో కలిసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీపీఎల్‌లో నబీ.. రషీద్ కన్నా ఎక్కువ ప్రభావం చూపుతున్నాడు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

దుబాయ్‌కు పయనం..

దుబాయ్‌కు పయనం..

సీపీఎల్ అనంతరం నబీ అటు నుంచి అటే దుబాయ్‌కు పయనం కానున్నాడు. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ అక్కడికి చేరుకొని క్వారంటైన్‌లో ఉంది. త్వరలో ప్రాక్టీస్ కూడా ప్రారంభించనుంది. నెమ్మదైన పిచ్‌లు కలిగిన యూఏఈలో స్పిన్నర్లు ప్రభావం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయాల్లో నబీ, రషీద్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫస్ట్ వీక్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫ్గానిస్తాన్ దేశీయ టీ20 టోర్నీ షపగీజాలో పాల్గొనేందుకు సీపీఎల్ మధ్యలోనే వారు కాబుల్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ లీగ్ సెప్టెంబర్ 6 నుంచి 16 వరకు జరగనుంది. ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. షపగీజా 16న ముగిసినా.. కరోనా క్వారంటైన్ నేపథ్యంలో ఫస్ట్ వీక్ మ్యాచ్‌లు మిస్సయ్యే అవకాశం ఉంది. అయితే ఆ లీగ్‌లో వారు పాల్గొనడంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు.

లీసా స్టాలేకర్ క్రికెట్ జర్నీ.. పుణె అనాథాశ్రమం నుంచి ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్' దాకా.!

Story first published: Tuesday, November 3, 2020, 10:15 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+