సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీని ఊరిస్తున్న ఐదు రికార్డులు!

దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మరొ కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను సొంత చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా గుర్తింపుపొందనున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 193 మ్యాచ్‌లు ఆడిన మహీ సురేశ్ రైనాతో సమానంగా ఉన్నాడు. తాజా మ్యాచ్‌తో ధోనీ అతన్ని అధిగమించనున్నాడు. అలాగే చెన్నై తరఫున అత్యధిక( 164) మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానూ నిలవనున్నాడు. రైనా కూడా సీఎస్‌కే తరఫున ఇప్పటివరకు 163 మ్యాచ్‌లు ఆడాడు.

ప్లే ఆఫ్ చెరితేనే..
మరోవైపు సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. రైనా గైర్హాజరీతో ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. అది కూడా చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటేనే. ఒకవేళ ధోనీసేన ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా ముంబై ఇండియన్స్ చేరితే అప్పుడు రోహిత్ శర్మ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే హిట్‌మ్యాన్ ఇప్పుడు 192 మ్యాచ్‌లతో కొనసాగుతున్నాడు.

మరో 24 పరుగులు చేస్తే..
ఇక గురువారం పంజాబ్‌తో తలపడిన మ్యాచ్‌లో రోహిత్ 5000 పరుగుల క్లబ్‌లో చేరాడు. ఇంతకుముందు సురేశ్ రైనాతో పాటు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ధోనీ విషయానికొస్తే ప్రస్తుతం 4,476 పరుగులతో కొనసాగుతున్నాడు. నేటి హైదరాబాద్ మ్యాచ్‌లో ఇంకో 24 పరుగులు చేస్తే అప్పుడతడు 4500 పరుగుల క్లబ్‌లో చేరతాడు.

రెండు సిక్స్‌లు కొడితే..
మహీ నేటి మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు కొడితే టీ20ల్లో 300కు పైగా సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరుతాడు. 368 సిక్స్‌లతో రోహిత్ శర్మ టాప్‌లో ఉండగా.. 311 సిక్స్‌లతో సురేశ్ రైనా ధోనీ కన్నా ముందున్నారు. ఇప్పటి వరకు ధోనీ టీ20ల్లో 298 సిక్స్‌లు కొట్టాడు. ఇక తన పూర్వవైభవాన్ని చూపెడుతూ భారీ సిక్స్‌లతో ధోనీ చెలరేగితే.. ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు కొడితే ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేస్తాడు. క్రిస్‌గేల్ 326 సిక్స్‌లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. డివిలియర్స్ 219, ధోనీ 212 సిక్స్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్‌లో 200కు పైగా సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడు ధోనీ.

కీపర్‌గా ‘సెంచరీ'
హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ రెండు క్యాచ్‌లు అందుకుంటే ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా సెంచరీ పూర్తి చేసుకుంటాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తర్వాత ఈ ఘనతను అందుకున్న ఆటగాడిగా నిలుస్తాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచిన సీఎస్‌కే తరువాత ఢిల్లీ, రాజస్థాన్ చేతిలో వరుస పరాజయాలు చవిచూసింది. గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు, డ్వేన్ బ్రావోలతో బరిలోకి దిగుతుంది.
ఓ ఐసీసీ.. ఇదేం డీఆర్‌ఎస్ రూల్? ఎట్టెట్టా.. ఆ సింగిల్ కౌంట్ కాదు? ఇంత అన్యాయమా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications