
దాదాతో నాకు న్యాయం దక్కుతుంది..
ఈ ఇంటర్వ్యూలో ఒకవేళ దాదా ఐసీసీ చీఫ్ అయితే జీవితకాల నిషేధంపై మరోసారి అప్పీల్ చేసుకుంటావా? అని ప్రశ్నించగా.. కనేరియా అవుననే సమాధానం చెప్పాడు. అంతేకాకుండా గంగూలీ ఛైర్మన్ అయితే ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అవును. గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అయితే నాపై విధించిన జీవితకాల నిషేధంపై మరోసారి అప్పీల్ చేసుకుంటా. అప్పుడు నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.'అని కనేరియా తెలిపాడు.

దాదాను మించినోడు లేడు..
‘సౌరవ్ గంగూలీ అద్భుతమైన క్రికెటర్. అతను ప్రతీ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఐసీసీ ప్రెసిడెంట్ పదవికి అతనికంటే మెరుగైన అభ్యర్థి మరొకరు లేరు. సారథిగా గంగూలీ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని బాటలోనే ధోనీ పయనించగా.. ప్రస్తుతం విరాట్ ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ ఛీప్‌గా ఉన్న అతను.. ఐసీసీ ఛీఫ్ అయితే క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లగలడనే నమ్మకం నాకు ఉంది.'అని కనేరియా చెప్పుకొచ్చాడు.

పీసీబీ మద్దతు అవసరం లేదు..
ఇక దాదా ఐసీసీ ప్రెసిడెంట్ కాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అడ్డుకోలేదని, అతనికి పీసీబీ సహాయమే అవసరంలేదన్నాడు.‘గంగూలీ ఓ బలమైన వ్యక్తి. అతనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మద్దతు అవసరమని నేను అనుకోవడం లేదు.'అని కనేరియా స్పష్టం చేశాడు. ఇక ఐసీసీ ప్రెసిడెంట్ కావడానికి గంగూలీ అన్ని విధాల అర్హుడని ఇటీవల క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ గ్రేమ్ స్మిత్ తెలిపిన విషయం తెలిసిందే.

స్పాట్ ఫిక్సింగ్‌తో లైఫ్‌టైమ్ బ్యాన్..
ఇక 2009లో కౌంటి క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పిన కనేరియాపై ఐసీసీ జీవితకాల నిషేధం విధించింది. డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి కనేరియా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు.
అయితే ఈ విషయంలో పీసీబీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, దేశం కోసం ఎంతో చేసినా.. కనీసం ఆర్థికంగా కూడా ఆదుకోలేదని చాలా సందర్భాల్లో కనేరియా తన ఆవేదనను పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన సల్మాన్ బట్, మహ్మద్ ఆమిర్ కూడా మళ్లీ క్రికెట్ ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువునైనందుకే పీసీబీ తన పట్ల వివక్ష చూపుతుందని ఆరోపించాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్: లక్ష్మణ్


Click it and Unblock the Notifications
