Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2027పై ఎంఎస్ ధోనీ క్లారిటీ!

ఐపీఎల్ 2027లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై క్రీడా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్లో ఆయన ఆడతారా లేక పసుపు చొక్కాకు గుడ్‌బై చెప్తారా అనే అంశంపై ధోనీ స్వయంగా స్పందిస్తూ కీలక సూచనలు చేశారు. రాబోయే డిసెంబర్ నాటికి తన శరీరం, ఫిట్‌నెస్ మరో సీజన్ తాకిడిని తట్టుకోగలదో లేదో సమీక్షించుకున్న తర్వాతే ఐపీఎల్‌లో కొనసాగడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎంస్ ధోనీ వెల్లడించారు.

IND vs NZ: వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: శ్రేయస్ అయ్యర్

IND vs NZ: వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: శ్రేయస్ అయ్యర్

'పాత కారు' పోలికతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. తన రీ-ఎంట్రీ పూర్తిగా వైద్య పరీక్షల నివేదికలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. "నేను త్వరలోనే పూర్తిగా ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఆ నివేదిక ఆధారంగా డిసెంబర్ లోపు వచ్చే సీజన్‌కు నా శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంచనా వేస్తాను. ఒకవేళ నేను మళ్లీ మైదానంలోకి దిగాలని భావిస్తే.. ఆ పాత కారు రోడ్డుపై సజావుగా, ఎలాంటి ఆటంకం లేకుండా నడిచేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది" అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎంఎస్ ధోని చేసిన ఈ కామెంట్స్ అభిమానుల్లో మళ్లీ కొత్త ఆశలను చిగురింపజేశాయి.

MS Dhoni IPL 2027 Old Car Remark Hints at Retirement or Return Medical reports and fitness tests in December

గాయాలు.. సీఎస్కే నిరాశజనక ప్రదర్శన
గత ఐపీఎల్ 2026 సీజన్లో ఫిట్‌నెస్ సమస్యలు, తీవ్రమైన గాయం కారణంగా ఎంఎస్ ధోనీ కొన్ని కీలక మ్యాచ్ లకు దూరం కావాల్సి వచ్చింది. ధోనీ లేకపోవడం, జట్టులో ఇతర కీలక ఆటగాళ్లు వరుసగా గాయపడటంతో సీఎస్కే తీవ్ర ప్రభావానికి గురైంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా మూడోసారి ప్లేఆఫ్స్, అర్హత సాధించడంలో విఫలమైన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

IND vs NZ: తెలుగులో తిట్టుకున్న నితీష్ రెడ్డి, తిలక్ వర్మ!(వీడియో)

Also Read

IND vs NZ: తెలుగులో తిట్టుకున్న నితీష్ రెడ్డి, తిలక్ వర్మ!(వీడియో)

సీఎస్కే, ఆర్సీబీ నిలకడపై ధోనీ స్పందన
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శనలో ఎంఎస్ ధోనీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "కాగితంపై మీ జట్టు ఎంత బలంగా ఉందనేది ముఖ్యం కాదు. మ్యాచ్ జరిగే రోజున మీరు గ్రౌండ్‌లో ఎలా రాణించారనేదే ఆఖరి ఫలితాన్ని తేలుస్తుంది. టీ20 క్రికెట్లో ఏ జట్టును తక్కువగా అంచనా వేయలేం. మేము గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో నిలకడగా ఆడలేకపోయామనేది నిజం" అని అంగీకరించారు. అదే సమయంలో ఆర్సీబీ ప్రదర్శనను ప్రశంసిస్తూ.. ఆర్సీబీ గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తోందని, సీఎస్కే కూడా మళ్లీ ఆ నిలకడను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉంటేనే జట్టు సమతుల్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. క్రీడా ప్రపంచం దృష్టి అంతా డిసెంబర్‌లో జరగనున్న ధోనీ ఫిట్‌నెస్ పరీక్షపైనే నిలిచింది. ఆ వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగానే ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో భాగమవుతాడా లేక వీడ్కోలు పలుకుతాడా అనేది అధికారికంగా తేలనుంది.

Story first published: Sunday, October 25, 2026, 10:12 [IST]
Other articles published on Oct 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+