న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ న్యూ లుక్ చూశారా?

 MS Dhoni flaunts his new hairstyle ahead of IPL 2020 as he lands in Chennai

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. భారత జట్టులో హెయిర్ స్ట్రైల్ సంస్కృతికి నాంది పలికిన ఈ జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్ ముంగిట స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశాడు.

పాక్ ప్రధాని మెచ్చిన హెయిర్ స్టైల్..

కెరీర్ స్టార్టింగ్‌లో పొడవాటి జుంపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ హెయిర్‌ స్టైల్స్‌లో ఒక ట్రెండ్‌ను సృష్టించాడు. అప్పట్లో అతని హెయిర్ స్టైల్‌కు పిచ్చ క్రేజ్ ఉండేది. చాలా మంది జుంపాల జట్టును పెంచుకొని అతని స్ట్రైల్‌ను ఫాలో అయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ సైతం ధోనీ హెయిర్ స్టైల్‌కు ముగ్ధుడయ్యాడు.

2006లో పాకిస్థాన్ పర్యటనలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందించే క్రమంలో ముషార్రఫ్ ధోని హెయిర్ స్టైల్‌ను కొనియాడాడు. ‘స్టేడియంలోని చాలా మంది ధోనీ హెయిర్ కట్ చేసుకోవాల్సిందిగా ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. కానీ.. ధోనీకి నా సలహా ఏంటంటే..? ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హెయిర్ కట్ చేయించుకోకు' అని సరదాగా వ్యాఖ్యానించాడు.

మైదానంలో కోహ్లీ ప్రవర్తనపై విలియమ్సన్ ఏమన్నాడంటే?

నయా లుక్..

అలాంటి ధోనీ తర్వాత ఉన్న పళంగా జుంపాల జట్టును కత్తిరించాడు. అయితే విభిన్న హెయిర్ స్ట్రైల్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఐపీఎల్ సీజన్ 2020 కోసం చెన్నై వచ్చిన ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా తెలియజేసింది. ‘తాళ దర్శనం.. విజిల్ పొడు'అనే క్యాప్షన్‌తో న్యూ లుక్‌ ఫొటోను షేర్ చేసింది. చుట్టూ ట్రిమ్ చేసి ఉన్న ధోనీ హెయిర్ స్టైల్‌పై అభిమానులు సరదా కామెంట్ చేస్తున్నారు. వేసవి కాలం నేపథ్యంలోనే ధోనీ హెయిర్ స్టైల్ మార్చడని కామెంట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనేందుకు చెన్నైకు వచ్చిన ధోనీ వీడియోను కూడా చెన్నై ఫ్రాంచైజీ షేర్ చేసింది.

ముంబైతో తొలి మ్యాచ్..

మార్చి 29 నుంచి ఐపీఎల్‌2020 సీజన్‌‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంఛైజీలన్నీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. మార్చి 29న చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.

Story first published: Monday, March 2, 2020, 15:30 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X