Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోన్ పక్కన పెట్టండి.. మైదానంలోకి రండి! జెన్ జెడ్‌కు ధోనీ అదిరిపోయే సలహా!

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేటి యువతరం(జెన్ జెడ్, జెన్ ఆల్ఫా) ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కీలక పిలుపునిచ్చారు. బెంగళూరులో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, ఏదో ఒక క్రీడను ఆడడం ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే వరకు వేచి చూడకుండా ముందు నుంచే బాడీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలని ఆయన హెచ్చరించారు.

స్మృతి మంధాన కీలక నిర్ణయం.. జట్టులోకి స్టార్ క్రికెటర్!

స్మృతి మంధాన కీలక నిర్ణయం.. జట్టులోకి స్టార్ క్రికెటర్!

నేటి తరం జీవనశైలిలో వచ్చిన తీవ్ర మార్పులను ఎంఎస్ ధోనీ ఎత్తి చూపారు. ఒకప్పుడు మానవ జీవితంలో నిరంతర కదలిక అనేది ఓ సహజమైన భాగంగా ఉండేదని, కానీ నేటి రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోనుంచి కారులో ఆఫీసుకు వెళ్లడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, మళ్లీ కారులోనే తిరిగి ఇంటికి చేరుకోవడం పరిపాటైందని అన్నారు. దీనివల్ల శరీరానికి తగినంత శారీరక శ్రమ లభించడం లేదని ఎంఎస్ ధోనీ వివరించారు.

MS Dhoni Fitness Advice Dhoni Urges Gen Z to Ditch Phones Exercise and avoid sedentary lifestyles

బద్ధకపు లైఫ్‌స్టైల్, సరికాని ఆహారపు అలవాట్ల వల్ల కలిగే ప్రమాదాలను ఎంఎస్ ధోనీ సవివరంగా హెచ్చరించారు. నూనెలో వేయించిన పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరగడం భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు. ఈ బద్ధకపు లైఫ్‌స్టైల్ వల్ల కలిగే దుష్ప్రభావాలు వెంటనే బయటపడకపోయినా,30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యల రూపంలో స్పష్టమవుతాయని హెచ్చరించారు. అందుకే ప్రతిరోజూ మైదానంలోకి దిగి ఏదో ఒక ఆట ఆడటం ద్వారా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలని సలహా ఇచ్చారు.

తెలుగోళ్ల విధ్వంసం.. జైకొట్టిన పాక్ ఫ్యాన్స్.. షాక్‌లో పాకిస్తాన్ మీడియా!

Also Read

తెలుగోళ్ల విధ్వంసం.. జైకొట్టిన పాక్ ఫ్యాన్స్.. షాక్‌లో పాకిస్తాన్ మీడియా!

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ నేటి యువతరంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పాత తరాల కంటే నేటి జెన్ జెడ్ తరం అనేక విషయాల్లో ఎంతో పరిణతి చెందిందని కొనియాడారు. తమ తరం తరచుగా పాత ఆలోచనలు, నియమాల్లో చిక్కుకుపోయి ఉండేదని, కానీ నేటి యువత నైతిక విలువలు, సానుకూల ధోరణిలో ఎంతో ముందుందని అంగీకరించారు. పెద్దవాళ్లు తమకే అన్నీ తెలుసని భావించకుండా, కొత్త తరం ఆలోచనల నుంచి నేర్చుకోవడానికిఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తానికి ఎంఎస్ ధోనీ, జావేద్ అక్తర్‌ల మధ్య జరిగిన ఈ సంభాషణ రెండు ప్రధాన అంశాలను స్పష్టం చేసింది. మొదటిది దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాల కోసం శారీరక శ్రమను అలవాటు చేసుకోవడం ఎంత కీలకమో ఎంఎస్ ధోనీ వివరించగా.. రెండోది నేటి యువతరం సాధిస్తున్న మార్పులను గౌరవిస్తూ వారి నమ్మకాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని జావేద్ అక్తర్ స్పష్టం చేశారు.

Story first published: Sunday, October 25, 2026, 14:36 [IST]
Other articles published on Oct 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+