ధోనీ నాకు హిందీ రాదనుకున్నాడు.. అతని సక్సెస్ సీక్రెట్ అదే: ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్

లండన్: వికెట్ల వెనుకాల బౌలర్లతో వ్యూహాలు రచించడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దిట్టా అనే విషయం తెలిసిందే. క్రీజులో బ్యాట్స్‌మన్ కదిలకలను ఇట్టే పసిగట్టి దానికి అనుగుణంగా బౌలర్లతో ఉచ్చును బిగించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అది ధోనీ కెప్టెన్సీలోని ప్రత్యేకత కూడా. ఈ విషయాన్ని భారత బౌలర్లు అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగే మహీ మాటలు స్టంప్ మైక్స్‌లో అనేక సార్లు రికార్డు అయ్యాయి. ప్రత్యర్థి ఆటగాళ్లకు అర్థం కాకుండా ధోనీ హిందీలో బౌలర్లకు సూచనలు చేస్తుంటాడు. ఇలానే ఓసారి తనకు హిందీ రాదనుకొని బౌలర్లకు సూచనలు చేశాడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ గుర్తు చేసుకున్నాడు.

ప్రతీ బంతికి సలహాలు ఇస్తుంటాడు..
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన మాంటీ పనేసర్ ఈ విషయాన్ని నెమరువేసుకున్నాడు. భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఇది జరిగిందన్నాడు.‘వికెట్ కీపర్‌గా ధోనీ బౌలర్లకు సూచనలు చేయడం నాకు గుర్తుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు అతను చాలా టిప్స్ ఇస్తుంటాడు. ‘కొంచెం వైడ్‌గా వేయండి. స్టంప్స్ మీదకు బౌలింగ్ చేయండి. బ్యాట్స్‌మన్ అక్రాస్ లైన్ ఆడుతున్నాడు.. స్ట్రైట్‌గా బంతులు వేయండి. మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాలనుకుంటున్నాడు. కొంచెం వైడ్‌గా బంతి వేయండి'అని సూచిస్తుంటాడు.

రానట్టే నటించా..
ఇలానే నాకు హిందీ రాదనుకోని నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా హిందీలో సూచనలు చేశాడు. కానీ నేను హిందీ, పంజాబ్ అనర్గళంగా మాట్లాడుతాను. అతను చెప్పేది ప్రతీది నేను విన్నాను. నేను కూడా ధోనీ మాట్లాడేది అర్థం కాన్నట్లు నటించా. కానీ నాకు ప్రతీది స్పష్టంగా అర్ధమైంది'అని పనేసర్ గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 50 టెస్ట్‌లు, 26 వన్డేలు, ఏకైక టీ20 ఆడిన పనేసర్.. సంప్రదాయక క్రికెట్‌లో 167 వికెట్లు, వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఏకైక టీ20లో రెండు వికెట్లు తీశాడు.

అదే ధోనీ సీక్రేట్.
ప్రత్యర్థుల మైండ్ సెట్‌ను ఇట్టే అంచనా వేయడం ధోనీ ప్రత్యేకతని, కానీ అతను ఆలోచనా విధానం మాత్రం ఎవరికి అర్థం కాదని, అదే అతని బలమని పనేసర్ ప్రశంసించాడు. ‘ప్రత్యర్థుల మానసిక స్థితిని ధోనీ సులువుగా అర్థం చేసుకుంటాడు. కానీ అతను మాత్రం ఎవరికీ అర్థం కాడు. అదే మహీ అదనపు బలం. ధోనీ మనస్సులో ఏముందో అని అస్సలు అంచనా వేయలేం. చివరి మూడు ఓవర్లలో భారత్ విజయానికి ఓవర్‌కు 15 రన్స్ చొప్పున చేయాల్సి ఉన్నా ధోనీ రాబడుతాడు. అది ఎలా చేసాడనేది మాత్రం ఎవరికి అర్థం కాదు. అదే ధోనీ సీక్రేట్'అని పనేసర్ కొనియాడాడు.

సగం పని అయ్యేది..
జడేజా, అశ్విన్, కుల్‌దీప్, చహల్ సక్సెస్ కావడానికి కారణం ధోనీనే. ఈ విషయాన్ని వారు కూడా పలుమార్లు చెప్పారు. ధోనీ వికెట్ల వెనుకాల ఉంటే తమ పని 50 శాతం పూర్తయినట్టేనని ఇటీవల చహల్ పేర్కొన్న విషయం తెలిసిందే. 'టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో మహీభాయ్ ఒకడు. అతడు నాకు, కుల్దీప్‌కు చాలా సాయం చేశాడు. బ్యాట్స్‌మెన్ కదలికలను బట్టి మాకు సలహాలు ఇచ్చేవాడు. ధోనీ భాయ్ వికెట్ల వెనుకాల ఉంటే మా పని 50 శాతం పూర్తయ్యేది.' అని ఓ ఇంటర్వ్యూలో చహల్ చెప్పుకొచ్చాడు.
వరల్డ్‌కప్ జట్టులో నాలుగో నెంబర్ నాదే అనుకున్నా: అజింక్యా రహానే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications