For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కూతురి విషయంలో మహ్మద్ షమీకి ఊహించని షాకిచ్చిన హసీన్ జహాన్!

 Mohammed Shami’s wife Hasin Jahan removes his surname from daughter Aairah’s name

కోల్‌కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి అతని సతీమణి హసీన్ జహాన్ ఊహించని షాకిచ్చింది. కుటుంబ విభేదాల కారణంగా ఈ ఇద్దరూ రెండేళ్లుగా వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పట్లో మహ్మద్ షమీ, అతని కుటుంబంపై హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. షమీకి చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని చెప్పడంతో పాటు గృహ హింస కేసు కూడా పెట్టింది. రోజుకో ఆరోపణతో హల్‌చల్ చేసింది. అనంతరం షమీకి పూర్తిగా దూరమైనా మధ్య మధ్యలో సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు గుప్పించిన హసీన్ జహాన్.. తాజాగా తన కూతురు పేరు చివరన ఉన్న షమీ ఇంటి పేరుని తొలగించింది.

 ఐరా జహాన్‌గా మార్పు..

ఐరా జహాన్‌గా మార్పు..

మహ్మద్ షమీకి తన కూతురు 'ఐరా షమీ' అంటే అమితమైన ప్రేమ. ఈ విషయాన్ని ఎన్నోసార్లు షమీ బహిరంగంగానే చెప్పాడు. కానీ హసీన్ జహాన్ తనతో పాటు కూతుర్ని కూడా తీసుకెళ్లింది. అయినా షమీ సోషల్ మీడియాలో తన కూతురు ఫొటోలను షేర్ చేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అయితే తాజాగా ఐరా పేరు చివరన ఉన్న షమీ పేరును తప్పించి.. 'ఐరా జహాన్'గా తన ఇంటిపేరును హసీన్ చేర్చింది. ఈ మేరకు ఇన్‌‌స్టాగ్రామ్ వేదికగా తన కూతురు ఫొటోను షేర్ చేసిన జహాన్.. అందలో ఐరా జహాన్‌గా పేర్కొంది.

ఛీర్ గర్ల్‌‌గా పరిచయం..

ఛీర్ గర్ల్‌‌గా పరిచయం..

ఐపీఎల్‌లో కోల‌్‌కతా నైట్‌రైడర్స్ ఛీర్ గర్ల్‌గా పనిచేసిన హసీన్ జహాన్‌‌ను అప్పట్లో షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన హసీన్ జహాన్.. అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలతో భారత జట్టులోకి వచ్చాడని విమర్శలు గుప్పించింది. అయితే.. బీసీసీఐ విచారణలో ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలింది.

 కోర్టులో పోరాడినా..

కోర్టులో పోరాడినా..

పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినప్పటికీ.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. కోర్టుని ఆశ్రయించిన హసీన్ జహాన్.. తనకి నెలకు రూ.10 లక్షలు షమీ నుంచి భరణం ఇప్పించాలని కూడా కోరింది. కానీ.. ఈ కేసులోనూ ఎలాంటి తీర్పు వెలవడలేదు. దాంతో.. క్రమంగా షమీకి దూరమైన హసీన్ జహాన్.. గత ఏడాది నుంచి మళ్లీ తన వృత్తి అయిన మోడలింగ్‌ను మొదలుపెట్టింది . మధ్య మధ్యలో మహ్మద్ షమీ స్వార్థపరుడంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పించడంతో పాటు హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను రెచ్చగొట్టింది. అప్పట్లో ఈమె టార్చర్ భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిన షమీ ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని, కుటుంబ సభ్యుల సాయంతో అలాంటి ఆలోచనల నుంచి బయటపడ్డానని తెలిపాడు.

 గాయంతో దూరం..

గాయంతో దూరం..

ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడ్డ మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. అడిలైడ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్యాట్ కమిన్స్ వేసిన రాకాసి బౌన్సర్ షమీ మణికట్టు‌ను తీవ్రంగా గాయపర్చింది. నొప్పితో విలవిలలాడిన షమీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో భారత్ 36 పరుగులకే పరిమితమై ఘోరపరాజయంతో పరువు తీసుకుంది. ఈ గాయంతోనే ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌కు కూడా షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో అతను పునరావసం తీసుకుంటున్నాడు.

మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండేందుకు విరాట్ కోహ్లీ సుముఖంగా ఉన్నాడా?

Story first published: Tuesday, February 2, 2021, 20:16 [IST]
Other articles published on Feb 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+