ఇప్పటికీ ధోనీనే నెంబర్ వన్ వికెట్ కీపర్.. తొందరపడి తొలగించొద్దు: కైఫ్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికీ ధోనీనే నెంబరవన్ వికెట్ కీపర్ అని కొనియాడాడు. జార్ఖండ్ డైనమైట్ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ్ల.. అతన్ని జట్టు నుంచి తప్పించవద్దని సూచించాడు. మహీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ కేవలం బ్యాకప్ కీపర్ మాత్రమేనని, ప్రధాన కీపర్ గాయపడ్డప్పుడు, ఆటగాళ్ల వర్క్ లోడ్ సమన్వయం చేసే క్రమంలో మాత్రమే అతను వికెట్ల వెనుకాల ఉంటాడని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌తో రీఎంట్రీ ..
గతేడాది వరల్డ్‌కప్ అనంతరం ఆటకు దూరమైన మహీ.. సుమారు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయాడు. అప్పుడే ధోనీ కెరీర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు.. ధోనీ ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని తెలిపాడు. దానికి తగ్గట్టే ధోనీ కూడా చెన్నై నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమటోడ్చాడు. కానీ కరోనా పుణ్యమా లీగ్ వాయిదా పడటంతో ధోనీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జార్ఖండ్ డైనమైట్ భవితవ్యంపై స్పందించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడితే ఆటగాడిగా మళ్లీ పుడతాం: బ్రావో

ధోనీ ప్లేస్‌ను రిప్లేస్ చేయలేరు..
‘సుదీర్ఘ విరామం తీసుకున్న ధోనీ ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ నేను మాత్రం అలా అనుకోలేదు. ధోనీ ఓ పెద్ద ఆటగాడు. మ్యాచ్ విన్నర్. తీవ్ర ఒత్తిడిలో ఆరు, ఏడు స్థానాల్లో ఎలా ఆడాలో బాగా తెలిసినవాడు. ఆ స్థానాలకు సరిగ్గా సరిపోయేవాడు. నా ఉద్దేశంలో ధోనీ ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేయరే. ఎంత మంది ఆటగాళ్లు వచ్చినా ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరు. ఎందుకంటే ఒకరిని తొలగిస్తే మరొకరు రెడీగా ఉండాలి. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో జడేజాతో ధోనీ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. దాదాపు గెలిపించేంత పనిచేశాడు.అలాంటి ఆటగాడి స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేరు.

పంత్,శాంసన్ నుంచే కాలేదు..
ఇప్పటికే అతని స్థానంలో చాలా మంది ఆటగాళ్లను ప్రయోగించారు. కేఎల్ రాహుల్ కూడా లాంగ్‌టర్మ్ ఆఫ్షన్ కాదనుకుంటున్నా. అతను ఎప్పటికీ బ్యాకప్ కీపర్‌గా ఉండాలి. ప్రధాన కీపర్ గాయపడితే రాహుల్ కీపింగ్ చేయాలి. కాబట్టి మరో కీపర్‌ను సిద్దం చేసుకోవాలి. చివరకు రిషభ్ పంత్, సంజూశాంసన్ కూడా ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. సచిన్, ద్రవిడ్ గురించి మాట్లాడినప్పుడు.. కోహ్లీ, రోహిత్, రహానే, పుజారా ప్రత్యామ్నాయంగా కనిపించారు. వీరు దిగ్గజాలు లేని లోటును తీర్చారు. కానీ ధోనీ విషయంలో అలా జరగలేదు. కాబట్టి నా దృష్టిలో ధోనీ ఇప్పటికీ నెంబర్ వన్ కీపరే. ఇప్పడు కూడా వికెట్ కీపర్‌గా రాణించగలడు. తొందరపడి అతన్ని పక్కనపెట్టొద్దు'అని కైఫ్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సచిన్ vs కోహ్లీ.. వన్డేల్లో ఎవరు గొప్పో చెప్పిన గంభీర్