Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్లబ్ స్థాయి అనుభవంలేని మిస్బా హెడ్ కోచా? : పాక్ మాజీ క్రికెటర్ ఫైర్

Mohammad Yousuf slams PCB for appointing Misbah-ul-Haq the head coach

కరాచీ: కనీసం క్లబ్ స్థాయి అనుభవంలేని మిస్బా ఉల్ హక్‌ను పాకిస్థాన్ క్రికెట్ టీమ్ హెడ్‌ కోచ్, సెలెక్టర్‌గా ఎలా నియమిస్తారని ఆదేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ ప్రశ్నించాడు. మిస్బా నియామకం ఇతరుల ప్రతిభను అపహాస్యం చేసేలా ఉందని ఈ మాజీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పీసీబీ ద్వంద విధానాలు..

పీసీబీ ద్వంద విధానాలు..

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ హెడ్‌కోచ్‌గా ఉన్న మిస్బాను మళ్లీ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)లో కోచ్‌గా ఎలా అనుమతిస్తారని, పీసీబీ ద్వంద విధానాలు తనకు అర్థం కావడంలేదని యూసఫ్ మండిపడ్డాడు.

‘బోర్డు ద్వంద్వ విధానాలు నాకు అర్థం కావడం లేదు. ఓవైపు అందరినీ కోచింగ్‌ అనుభవం చెప్పాలని అడుగుతూనే మరోవైపు క్లబ్‌స్థాయిలో కూడా కోచ్‌గా ఎలాంటి అనుభవం లేని మిస్బాను హెడ్‌కోచ్‌గా, సెలెక్టర్‌గా నియమించింది. మిస్బాను హెడ్‌కోచ్‌గా నియమించడం ప్రతిభను అపహస్యం చేసినట్లు ఉంది. అలాగే జాతీయ జట్టు హెడ్ కోచ్ అయిన అతన్ని పీఎస్ఎల్‌లో కోచ్‌గా అనుమతించడం మరీ విచిత్రంగా ఉంది'అని మిస్బా పేర్కొన్నాడు.

అజార్ అలీకి అవకాశం ఇవ్వలేదు..

అజార్ అలీకి అవకాశం ఇవ్వలేదు..

ఇక మిస్బా కెప్టెన్‌గా ఉన్నంత కాలం పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ అజార్ అలీకి వన్డేల్లో అవకాశం ఇవ్వలేదని యూసఫ్ చెప్పుకొచ్చాడు. ‘ఇటీవల మిస్బాకు సంబంధించిన ఓ మీడియా ఇంటరాక్షన్ చూశా. అతను నోరు తెరిస్తే నీతి, నిజాయితీ అని మాట్లాడుతున్నాడు. కానీ అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అద్భుత నైపుణ్యం కలిగిన అజార్ అలీని వన్డే జట్టులోకి రాకుండా అడ్డుకున్నాడు'అని యూసఫ్ తెలిపాడు.

మిస్బా బ్యాటింగ్ చాలా స్లో..

మిస్బా బ్యాటింగ్ చాలా స్లో..

2013, 2015 మధ్య కాలంలో అజార్ అలీకి వన్డే అవకాశాలు దక్కలేదు. ఆ సమయంలో మిస్బా కెప్టెన్ ఉన్నాడని, తానెప్పుడు అజార్‌కు ఫేవర్‌గా లేడని 45 ఏళ్ల యూసఫ్ ఆరోపించాడు. మిస్బా వీడ్కోలు అనంతరమే అజార్ వన్డే జట్టులోకి వచ్చాడని గుర్తు చేశాడు. బ్యాటింగ్ నైపుణ్యంలో మిస్బాతో పోల్చితే అజారే మెరుగైన వాడని తెలిపాడు. ఇక మిస్బా బ్యాటింగ్ చాలా నెమ్మదిగా ఉంటుందని, డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవాడని, స్పిన్నర్ల బౌలింగ్‌లోనే భారీ షాట్లు ఆడుతాడని యూసఫ్ విశ్లేషించాడు.

‘బ్యాటింగ్ స్కిల్ పరంగా మిస్బా కన్నా అజారే బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అజార్ ఓపెనర్, వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేయగలడు. సెటిల్ అయ్యేవరకు కొంత సమయం తీసుకుంటాడు. కానీ మిస్బా సమయం తీసుకున్నా నెమ్మదిగానే ఆడేవాడు. అతనికెలాంటి నైపుణ్యం లేదు. ఒకే విధానంలో ఆడుతుండేవాడు. ఎక్కువగా డిఫెన్స్ చేస్తుంటాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ధాటిగా ఆడే ప్రయత్నం చేసేవాడు'అని యూసఫ్ చెప్పుకొచ్చాడు.

ఆ మహిళా క్రికెటర్‌తో డిన్నర్ చేయాలనుంది: భారత క్రికెటర్

బెస్ట్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్..

బెస్ట్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్..

పాకిస్థాన్ బెస్ట్ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన మహ్మద్ యూసఫ్ 90 టెస్టుల్లో 50 సగటుతో 7530 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 288 మ్యాచ్‌లు ఆడి 15 శతకాలు, 64 హాఫ్ సెంచరీలతో 9720 రన్స్ సాధించాడు. మూడు టీ20లే ఆడిన యూసఫ్ 50 పరుగుల చేశాడు.

Story first published: Thursday, April 16, 2020, 13:28 [IST]
Other articles published on Apr 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+