Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సత్తా రోహిత్‌కే ఉంది: మాజీ క్రికెటర్

Mohammad Kaif Says Rohit Sharma can score double-century in T20s

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డేల్లోనే డబుల్ సెంచరీ సాధించడానికి ఆటగాళ్లు కొన్నేళ్లు నిరీక్షించారు. దిగ్గజ ఆటగాళ్లు సయిద్ అన్వర్, చార్లెస్ కవెంట్రీలు సమీపంగా వచ్చి తృటిలో అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇక అసాధ్యం అనుకున్న డబుల్ సెంచరీని 2010లో దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుసాధ్యం చేశాడు. అనంతరం మరో ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్‌ను అందుకున్నారు.

బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారిన తరంలో..

బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారిన తరంలో..

ఇక బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారిన ప్రస్తుత తరంలో టీ20ల్లో కూడా డబుల్ సెంచరీ సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీ టీ20ల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ 172 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఇదే టాప్ స్కోరర్‌గా ఉంది. ఇక ఓవరాల్‌ టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా 175 పరుగులతో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ కొనసాగుతున్నాడు. ఈ పరుగులను చూస్తే.. టీ20ల్లో కూడా డబుల్ సెంచరీ సాధ్యమే అనిపిస్తోంది.

ఆ సత్తా రోహిత్‌కే..

ఆ సత్తా రోహిత్‌కే..

అయితే.. టీ20ల్లో ఫస్ట్ డబుల్ సెంచరీని అందుకోగల సామర్థ్యం ఉన్న క్రికెటర్ ఎవరా? అనే చర్చ వచ్చిన ప్రతీసారి అందరూ నోట వినిపించే పేరు రోహిత్ శర్మ. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా హిట్‌మ్యాన్‌‌కే అవకాశం ఉందని చెప్పాడు. భారత అండర్-19 టీమ్ మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గె‌తో ఇటీవల హలో యాప్‌ ద్వారా మహ్మద్ కైఫ్ మాట్లాడుతుండగా.. టీ20ల్లో డబుల్ సెంచరీ గురించి చర్చ వచ్చింది. దాంతో.. రోహిత్ శర్మకి ఆ మైలురాయిని అందుకునే సామర్థ్యం ఉందని కితాబిచ్చిన కైఫ్.. టీ20ల్లో సెంచరీ తర్వాత రోహిత్ శర్మ స్ట్రైక్‌రేట్‌ పతాక స్థాయిలో ఉంటోందని గుర్తుచేశాడు. వన్డేల్లో ఇప్పటికే రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

స్ట్రైక్ రేట్ చూస్తేనే..

స్ట్రైక్ రేట్ చూస్తేనే..

‘టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించగల సామర్థ్యం రోహిత్ శర్మకి ఉంది. అతని స్ట్రైక్‌రేట్ మ్యాచ్‌ మ్యాచ్‌కు క్రమంగా పెరుగుతూ పోతుంది. కొన్నిసార్లు అతను నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా.. సెంచరీ తర్వాత మాత్రం అతని స్ట్రైక్‌రేట్ 250-300 మధ్యలో ఉంటుంది. కాబట్టి.. రోహిత్ కచ్చితంగా డబుల్ సెంచరీ మైలురాయిని అందుకోగలడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో టీమ్ 200-250 పరుగులు చేయడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు 400-500 స్కోర్లు గురించి మాట్లాడుకుంటున్నారు'అని కైఫ్ వెల్లడించాడు.

ఇప్పటి వరకూ 108 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన హిట్‌మ్యాన్.. 138.79 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 2,773 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 118.

ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్‌పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!

Story first published: Friday, June 12, 2020, 20:08 [IST]
Other articles published on Jun 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+