Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను వికెట్ కీపర్ కాకుంటే వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అయ్యేవాడు: మహ్మద్ కైఫ్

Mohammad Kaif Says MS Dhoni would have been a good fielder anywhere in the field

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ ఫీల్డింగ్, ఫిట్‌నెస్ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టిసారిస్తుంటాడు. అది వ్యక్తిగతమైనా.. జట్టులోనైనా అతని తొలి ప్రాధాన్యత ఫిట్‌నెస్, ఫీల్డింగే. భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకోగానే ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచడానికి కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టేయడానికి వెనకడగు వేయలేదు. ఇక వ్యక్తిగతంగా కూడా మహీ ఇప్పటి వరకు ఆ ప్రమాణాలే పాటించాడు. తన కంటే వయస్సులో చాలా చిన్నోడైన హార్దిక్ పాండ్యాను పరుగుపందెంలో ఓడించిన వీడియోనే దీనికి ఉదాహరణగా పరిగణించవచ్చు.

ధోనీ తలుచుకుంటే...

ఇక ధోనీ కీపింగ్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ కీపర్లలో మహీ టాప్‌లో ఉంటాడు. అయితే భారత క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా చెప్పుకునే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. ధోనీ ఫీల్డింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహీ తలచుకుంటే మంచి ఫీల్డర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డాడు. ధోనీ ఫీల్డింగ్ కు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసిన కైఫ్.. ‘మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్ చేసినా ధోనీ వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అయ్యేవాడు. అదే విధంగా నేనూ బ్యాడ్ కీపర్ కాకపోయేవాడిని'అని ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

వీడియోలో ఏం ఉందంటే..

వీడియోలో ఏం ఉందంటే..

ఈ వీడియోలో సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఉన్న ధోనీ.. కైఫ్ సాయంతో బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేశాడు. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ సిల్లి పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. కీపర్ ధోనీ పరుగెత్తి బంతిని కైఫ్‌కు అందజేశాడు. అంతేవేగంగా అతను వికెట్లను కొట్టేయడంతో బ్యాట్స్‌మన్‌ పెవలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక కైఫ్ వ్యాఖ్యలతో అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో మైదానంలో జరిగిన ఫీల్డింగ్ విన్యాసాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక కైఫ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

ధోనీని అలా చూసి ఆశ్చర్య పోయా..

ఇక ఎన్నడూ లేనివిధంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ కీపింగ్ సాధన చేయడం చూసి ఆశ్చర్యపోయానని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇటీవల చెన్నై ఫ్రాంచైజీ తమ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ధోనీ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. లాంగ్ గ్యాప్ కారణంగానే ధోనీ ఎన్నడూ లేని విధంగా కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని పఠాన్ పేర్కొన్నాడు.

‘ధోనీ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేసే వీడియోను చూశాను. అతనితో కలిసి నేను ఎన్నో ఏళ్లు ఆడాను. కానీ ఎప్పుడూ ఇలా ధోనీ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం చూడలేదు. భారత జట్టుతోనైనా.. సీఎస్‌కేతో ఉన్నా ఎప్పుడూ ధోనీ ప్రాక్టీస్ చేసింది లేదు.'అని పఠాన్ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో చెప్పుకొచ్చాడు.

ధోనీ vs పాండ్యా రన్నింగ్ రేస్..

ధోనీ vs పాండ్యా రన్నింగ్ రేస్..

మూడేళ్ల క్రితం శ్రీలంకతో సిరీస్ సందర్బంగా ధోనీ, పాండ్యా సరదాగా రన్నింగ్ పోటీ పెట్టుకున్నారు. ఇద్దరూ సమానంగా పరిగెత్తినప్పటికీ.. చివర్లో పాండ్యాను వెనక్కు నెట్టిన ధోనీ విజయం సాధించాడు. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన పాండ్యను ఓడించిన ధోనీ.. తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఈ వీడియోను అప్పట్లో బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఐపీఎల్ సందర్భంగా కూడా వికెట్ల మధ్య డ్వెన్ బ్రావోతో పోటీపెట్టుకొని నెగ్గాడు.

హర్భజన్ సింగ్‌కు రూ.4 కోట్లు ఎగ్గొట్టిన చెన్నై వ్యాపారి.. కేసు నమోదు!

Story first published: Thursday, September 10, 2020, 13:20 [IST]
Other articles published on Sep 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+