Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ, కోహ్లీపై యూవీ తండ్రి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు: కైఫ్

Mohammad Kaif reacts to Yograj Singhs allegations on MS Dhoni, Virat Kohli

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్‌, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీల వెన్నుపోటు కారణంగానే తన కుమారుడు వెనకబడిపోయాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సెలెక్టర్లతో కుమ్మక్కై అందరు కలిసి తన కొడుకు కెరీర్‌ను ముగించేలా చేసారని యోగ్‌రాజ్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తాజాగా స్పందించాడు. తాజాగా హలో మొబైల్ యాప్‌ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన ఈ మాజీ క్రికెటర్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదు..

ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదు..

ఈ నేపథ్యంలో ఓ అభిమాని యోగ్‌రాజ్ వ్యాక్యలను కైఫ్‌ ముందు ప్రస్తావించాడు. దీంతో ఆ వ్యాఖ్యలపై స్పందించిన కైఫ్ యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం ఉందని తాను అనుకోవడం లేదన్నాడు.‘యూవీ తండ్రి ఆరోపణలు నిజమనుకోవడం లేదు. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో యూవీ చాంపియన్. అతనికి మరిన్ని అవకాశాలు దక్కాల్సింది. కానీ భారత్‌లో ఫామ్‌ కోల్పోయి కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైతే.. జట్టులో స్థానాన్ని కాపాడుకోవడం కష్టం. ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్లు భారత జట్టులోకి రావాలని ఎదురు చూస్తుంటారు'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

 ధోనీకి ఆ హక్కు ఉంది..

ధోనీకి ఆ హక్కు ఉంది..

ఇక యూవీ తండ్రి ముఖ్యంగా ధోనీనే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. సౌరవ్ గంగూలీ ఇచ్చిన మద్దతు ధోనీ.. యూవీకి ఇవ్వలేకపోయాడన్నాడు. ఈ వ్యాఖ్యలను కూడా కైఫ్ తప్పుబట్టాడు. కెప్టెన్‌గా జట్టును ఎంపిక చేసే హక్కు ధోనీకి ఉందన్నాడు. ‘వైట్ బాల్ క్రికెట్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్. జట్టును స్వేచ్చగా తనకు నచ్చినట్టుగా ఎంపిక చేసుకోవడానికి అతను అన్నివిధాల అర్హుడు. అతను విఫలమైతే ధోనీని ప్రశ్నించినా ఓ అర్థం ఉంటుంది. కానీ అతను అద్భుత రికార్డులు సృష్టించాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఇక యువరాజ్‌, కైఫ్ కెరీర్‌ను దాదాపు ఓకేసారి ప్రారంభించారు. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఈ ఇద్దరు అద్భుత ప్రదర్శనతో భారత జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. తమ సూపర్ ఫీల్డింగ్‌తో కూడా ఈ స్టార్ ప్లేయర్లు అందరి ప్రశంసలు అందుకున్నారు.

 వెన్నుపోటు పొడిచారు..

వెన్నుపోటు పొడిచారు..

ఇటీవల న్యూస్ 24 చానె‌ల్‌తో మాట్లాడిన యోగ్‌రాజ్... యువరాజ్‌ సింగ్‌ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారని.. అందులో ధోనీ, విరాట్ కూడా ఉన్నారని మండిపడ్డారు. ‘ధోనీ, కోహ్లీలతో పాటు సెలెక్టర్లు కూడా యువరాజ్‌కు మద్దతు ఇవ్వలేదు. యువీ ఫామ్‌లోకి వస్తే ఎలా? అనే ఆందోళన అందరిలోనూ కనిపించేది. చాలామంది యువీకి వెన్నుపోటు పొడిచారు. ఇది అతడిని ఎంతగానో బాధించింది.ఇటీవల కోచ్‌ రవిశాస్త్రి కలిసాడు. నాతో సెల్ఫీ కూడా దిగాడు. నేను అతనితో దిగ్గజ ఆటగాళ్ల వీడ్కోలు విషయాన్ని ప్రస్తావించా. కెరీర్‌లో వారి ప్రదర్శన ఆధారంగా క్రికెటర్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని సూచించా. ధోనీ, రోహిత్, కోహ్లీ రిటైర్ అయినా వారికి ఘన వీడ్కోలు ఇవ్వాలి. భారత క్రికెట్‌కు వారు చేసిన సేవలను గుర్తించాలని సూచించా.'అని యోగ్‌రాజ్‌ తెలిపారు.

యూవీ కెప్టెన్ కావాల్సింది..

యూవీ కెప్టెన్ కావాల్సింది..

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియాకి కెప్టెన్ కావడానికి యువరాజ్ సింగ్ అర్హుడని, కానీ విధి ఎంఎస్ ధోనీని కెప్టెన్‌ని చేసిందన్నారు. ‘వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ మాట్లాడిన వీడియోలను చూశాను. వీడియోలో వారు మాట్లాడిన ప్రతి అంశాన్ని విన్నాను. ప్రతి ఒక్కరూ ధోనీ గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒకటి నెగటివ్‌గా మాట్లాడారు. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి ఎవరూ చెడుగా మాట్లాడలేదు. గంగూలీ సారథ్య బాధ్యతలు అందుకునే సమయానికి భారత జట్టు నంబర్ ఏడులో ఉండేది. యువరాజ్, కైఫ్, ఖాన్, హర్భజన్ , సెహ్వాగ్, గంభీర్ తదితర యువ క్రికెటర్లతో అప్పట్లో జట్టుని దాదా సిద్ధం చేసుకున్నాడు. గంగూలీ తర్వాత యువీ కెప్టెన్ కావాల్సింది. కానీ.. విధి ధోనీని కెప్టెన్‌‌ను చేసింది' అని యోగరాజ్ సింగ్ చెప్పారు.

క్రికెటర్ల భార్యల వైపు చూసి.. కోహ్లీ అలా అరవడంతో రెచ్చిపోయా: రసెల్

Story first published: Tuesday, May 19, 2020, 11:37 [IST]
Other articles published on May 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+