
కమాన్.. అంటూ
ఆర్సీబీ విధించిన భారీ లక్ష్యచేధనకు దిగిన తమ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ వికెట్ కోల్పోయిందని ఆ సమయంలో విరాట్ చేసుకున్న సంబరాలు తనను రెచ్చగొట్టాయన్నాడు.‘దినేశ్ కార్తీక్ ఆడిన ఓ షాట్ మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న యుజువేంద్ర చహల్ చేతిలో పడింది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ.. ఆటగాళ్ల సతీమణులు, కోల్‌కతా అభిమానులు కూర్చున్న స్టాండ్స్ వైపు తిరిగి ‘కమాన్'అంటూ ఇంకేవో పదాలతో బిగ్గరగా అరిచాడు.'అని రసెల్ చెప్పుకొచ్చాడు.

శుభ్‌మన్‌కు ఒక్కటే చెప్పా..
ఇక దినేశ్ కార్తీక్ అనంతరం క్రీజులోకి శుభ్‌మన్ గిల్ రాగా.. అతనికి సాధ్యమైనంత వరకు స్ట్రైకింగ్ ఇవ్వడానికి ప్రయత్నించమని చెప్పానని ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ గుర్తు చేసుకున్నాడు. ‘శుభ్‌మన్ గిల్ క్రీజులోకి రాగానే.. అతని ఒక్కటే చెప్పా. బౌలర్‌తో సంబంధం లేకుండా ధాటిగా ఆడాలనుకుంటున్నా. ఈ రాత్రి వాళ్లకి కాలరాత్రిగా మిగల్చాలనుకుంటున్నా. సాధ్యమైనంత వరకు స్ట్రైకింగ్ ఇవ్వడానికి ప్రయత్నించు అని చెప్పా. అతను కూడా మీరు చెప్పినట్టే బిగ్‌మ్యాన్ అన్నాడు'అని రసెల్ వెల్లడించాడు.
స్కోర్ బోర్డును కూడా చూడలేదు..
‘సిక్స్ కొట్టిన ప్రతిసారీ.. కనీసం, స్కోరుబోర్డు వైపు కూడా చూడలేదు. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు ప్రేక్షకులు, ఇతర విషయాలకు దూరంగా ఉంచుతాయి.
బంతిని హిట్ చేసినప్పుడల్లా.. శభ్‌మన్ దగ్గరకు వెళ్లేవాడిని. గ్లౌవ్స్‌తో పంచ్ ఇచ్చుకొని వెనక్కి వచ్చే వాడిని. అలా వచ్చేటప్పుడు బిగ్గరగా శ్వాస తీసుకునేవాడిని. ఇలా చేయడం వల్ల నేను ప్రశాంతత పొందేవాడిని'అని ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ తెలిపాడు. ఇక ఆ మ్యాచ్‌లో రసెల్ కేవలం 13 బంతుల్లో 6 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 48 పరుగులతో వీరవిహారం చేశాడు. అతని ధాటికి కోల్‌కతా 5 వికెట్లతో ఘనవిజయాన్నందుకుంది.

బెంగళూరు భారీ స్కోర్ చేసినా..
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా మొదట్లో తడబడింది. ఇక ఆర్సీబీ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ కోల్‌కతా విజయానికి 26 బంతుల్లో 67 పరుగులు కావాల్సిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రసెల్ పరుగుల విధ్వంసమే సృష్టించాడు. సిక్సర్ల సునామీతో కోల్‌కతాకు అద్భుత విజయాన్నందించాడు.


Click it and Unblock the Notifications

ఆ పరుగు వీరులు విఫలమవుతారని ముందే తెలుసు: కేంద్ర మంత్రి










