Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హమ్మయ్యా.. నాకు కరోనా సోకలేదు: పాక్ క్రికెటర్

Mohammad Hafeez’s second report tests negative for Coronavirus

లాహోర్‌: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో 10 మంది ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ పర్యటన కోసమని ఎంపిక చేసిన 29 మంది క్రికెటర్లకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించిన పీసీబీ.. సోమవారం ముగ్గురు, మంగళవారం ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది.పీసీబీ ప్రకటించిన పది మంది క్రికెటర్ల జాబితాలో పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ కూడా ఉన్నాడు.

నిన్న పాజిటీవ్.. నేడు నెగటీవ్..

నిన్న పాజిటీవ్.. నేడు నెగటీవ్..

కరోనా నిర్దారణ అయిందని ప్రకటించి ఒక్క రోజు గడవకముందే తనకు కరోనా లేదని హఫీజ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. సెకండ్ ఒపినియన్‌లో భాగంగా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో మరోసారి పరీక్షలు జరిపించుకన్నానని, ఇందులో నెగటీవ్ వచ్చిందని ట్వీటర్ వేదికగా స్పష్టం చేశాడు. టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్టులను కూడా పంచుకున్నాడు.

ఆ అల్లా దయ..

‘రిపోర్ట్స్‌లో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని పీసీబీ మంగళవారం స్పష్టం చేసింది. అయితే నా ఆత్మ సంతృప్తికొరకు మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి పరీక్షలు చేయించుకున్నా. నాతో సహా మా కుటుంబ సభ్యులకు నెగటీవ్ వచ్చింది. ఆ అల్లానే మా అందరిని సురక్షితంగా ఉంచుతాడు'అని ట్వీట్ చేశాడు. ఇక హఫీజ్ ట్వీట్‌తో కరోనా సోకిన ఆటగాళ్లంతా పునరాలోచనలో పడ్డారు. మరోసారి టెస్ట్‌లు చేయించుకోవాలని భావిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారమే..

షెడ్యూల్ ప్రకారమే..

ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టీ20ల కోసం పాక్‌ జట్టు ఆడాల్సి ఉండగా.. ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించడం విశేషం. అయితే ప్రస్తుతం హఫీజ్‌కు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో ఇంగ్లండ్‌ పర్యటనరు వెళ్లే అవకాశం ఉంది. కాగా కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆటగాళ్లకు జూన్‌ 25న మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తేలింది.

రిజర్వ్ ఆటగాళ్లకు పరీక్షలు..

రిజర్వ్ ఆటగాళ్లకు పరీక్షలు..

పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్‌. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా వారికి టీ20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్‌ గైర్హాజరులో మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లు బిలాల్‌ ఆసిఫ్, ఇమ్రాన్‌ బట్, మూసా ఖాన్, మొహమ్మన్‌ నవాజ్‌లను ఎంపిక చేశాము. పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది.' అంటూ పీసీబీ సీఈవో వసీం ఖాన్‌ పేర్కొన్నాడు.

భారత గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ ‌అతనే.. 52 శాతం ఓట్లతో పట్టం కట్టిన ఫ్యాన్స్

Story first published: Wednesday, June 24, 2020, 17:34 [IST]
Other articles published on Jun 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+