Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా బలమైన జట్టే.. కానీ!: కివీస్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

టీమిండియాతో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని బలమైన భారత జట్టుతో సిరీస్ చాలా హోరాహోరీగా సాగిందని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో తమ జట్టు విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి చేజారాయని మిచెల్ శాంట్నర్ గుర్తు చేసుకున్నాడు. ఆ రెండు మ్యాచుల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చి ఉంటే సిరీస్ స్కోరు బోర్డు పూర్తిగా వేరుగా ఉండేదని.. అయినప్పటికీ టీమిండియా 3-2తో గెలిచిన ఈ సిరీస్ నుంచి తాము ఎన్నో సానుకూల అంశాలను స్వీకరిస్తున్నామని వెల్లడించాడు.

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

ఈ సిరీస్ లో తమ జట్టు బ్యాటింగ్ విభాగం ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణించిందని.. దాదాపు ప్రతి మ్యాచ్ లో 200 పైచిలుకు పరుగులు సాధించడంతో పాటు ఒక మ్యాచ్ లో 260 పరుగులు కూడా నమోదు చేశామని మిచెల్ శాంట్నర్ తెలిపాడు. చివరి రెండు మ్యాచుల్లో కివీస్ బౌలర్లు పిచ్ పరిస్థితులకు తగ్గట్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడుతున్న సమయంలో తమ పేసర్లు వైడ్ యార్కర్లు, వేరియేషన్లతో అద్భుతంగా కట్టడి చేశారని పేర్కొన్నాడు. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో ఆడిన మ్యాచ్‌లు తమ జట్టుకు గొప్ప పాఠాలను నేర్పాయని ఆయన స్పష్టం చేశాడు.

Mitchell Santner Reflects on 3-2 T20I Series Loss to India Praises Glenn Phillips and Bowling
అదే మా కొంపమంచింది.. మా ఓటమికి కారణం అదే: శ్రేయస్ అయ్యర్

Also Read

అదే మా కొంపమంచింది.. మా ఓటమికి కారణం అదే: శ్రేయస్ అయ్యర్

జట్టులోని ఆటగాళ్ల ఆటతీరు, స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఆటతీరుపై మిచెల్ శాంట్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రొటేషన్ పాలసీ వల్ల తుది జట్టులో ఎక్కువ అవకాశం దక్కని యంగ్ ప్లేయర్లకు అవకాశం లభించిందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వారు చక్కగా ఉపయోగించుకుని తమ సత్తా నిరూపించుకున్నారని అన్నాడు. ప్రధానంగా గ్లెన్ ఫిలిప్స్ ప్రతీ మ్యాచ్‌లోనూ క్రీజులో సమయం తీసుకుని భారత బలమైన బౌలింగ్ దాడిపై విరుచుకుపడడం విశేషమని.. ఈ సిరీస్‌లో తమ జట్టు మెరుగైన స్థానంలో నిలవడానికి గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగే ప్రధాన కారణమని మిచెల్ శాంట్నర్ కొనియాడాడు.

Story first published: Sunday, November 1, 2026, 18:23 [IST]
Other articles published on Nov 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+