అదే మా కొంపమంచింది.. మా ఓటమికి కారణం అదే: శ్రేయస్ అయ్యర్
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో పరాజయం పాలైన అనంతరం భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ఫలితంపై స్పందించాడు. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగిందని.. ముఖ్యంగా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో లభించిన పరుగులను చూస్తే భారత జట్టు మరింత మెరుగైన స్కోరు సాధించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుపై ప్రభావం చూపిందని, బ్యాటింగ్ చేయడానికి ఈ పిచ్ ఏమాత్రం ఈజీగా లేదని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. హార్డ్ లెంగ్త్‌లో పడిన బంతులను ఎదుర్కోవడం కష్టంగా మారిందని.. అయినప్పటికీ 191 పరుగుల స్కోరు సాధించడం సంతృప్తికరమేనని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.
అయితే బ్యాటింగ్ కంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తమ జట్టు వైఫల్యం చెందిందని శ్రేయస్ అయ్యర్ అంగీకరించాడు. ఫీల్డింగ్‌లో చోటుచేసుకున్న పొరపాట్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని, ఇది జట్టుకు ఓ గొప్ప పాఠమని అభిప్రాయపడ్డాడు. సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లలో సాధించిన విజయాలు జట్టులో మంచి ఫామ్ ను ఇచ్చాయని స్పష్టం చేశాడు. చివరి రెండు మ్యాచ్‌లలో తాము కొత్త విషయాలను ప్రయోగించి.. సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితిలో ఉండటం వల్లే ఈ రకమైన వ్యూహాలతో బరిలోకి దిగామని, అయినప్పటికీ ఆటగాళ్లందరూ పూర్తి ఉత్సాహంతో ఉన్నారని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

విదేశీ పర్యటనలకు వచ్చినప్పడు వేర్వేరు పరిస్థితుల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయని, ప్రధానంగా ఫీల్డింగ్ విభాగంలో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ వివరించాడు. ఇండియాలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇక్కడ ఉన్న చీకటి వెలుగులు, స్పష్టమైన ఆకాశం మధ్య క్యాచ్‌లను అంచనా వేయడం అనుకున్నంత సులభం కాదని ఆయన పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ.. ఈ లోపాలను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్‌ల్లో మరింత బలంగా పుంజుకుంటామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


