అప్పుడే అంపైర్లకు ధోనీ క్షమాపలు చెప్పాడు: సాంట్నర్

చెన్నై: ఎప్పుడూ ప్రశాంతంగా కనబడే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. గతేడాది ఐపీఎల్ సందర్భంగా ఉగ్రరూపం దాల్చాడు. తన శైలికి భిన్నంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన నాటి మ్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరు ధోనీ ప్రవర్తనను చూసి అవాక్కయ్యారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను బయటపెట్టని మహీ.. ఆ నాడు అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నోబాల్‌గా ప్రకటించి..
జైపూర్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి మూడు బంతులకు ఎనిమిది పరుగులు కావాలి. క్రీజులో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ బెన్ స్టోక్స్ ఫుల్‌టాస్ వేయగా.. ప్రధాన అంపైర్ ఉల్లాస్ గాంధే నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. అనంతరం లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్‌తో చర్చించి సరైన బంతిగా ప్రకటించాడు.

మైదానంలోకి దూసుకొచ్చిన ధోనీ..
ఈ నిర్ణయంతో అవాక్కైన ధోనీ డగౌట్ నుంచే అరుస్తూ మైదానంలోకి దూసుకొచ్చాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జడేజా అంపైర్ డిసిషన్‌పై నిలదీయగా..
ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదించాడు. అయినా అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడ్డాడు. చివరి బంతికి సాంట్నర్ సిక్స్ కొట్టి చెన్నైకి అద్బుత విజయాన్నందించాడు. నాటి క్షణాలను సాంట్నర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ.. ధోనీ అలా మైదానంలోకి దూసుకు రావడం చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. ధోనీ కూడా అప్పుడే అంపైర్లు క్షమాపణలు చెప్పాడని ఈ కివీస్ ఆల్‌రౌండర్ గుర్తు చేసుకున్నాడు.

అవాక్కయ్యాను..
‘అందరిలాగే నేను కూడా చాలా ఆశ్యర్యపోయా. ధోనీ ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అయితే ఈ ఘటన అతడు జట్టు పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నాడో, టీమ్‌ను తన కుటుంబంలా ఎంతలా ఫీలవుతున్నాడో తెలియజేసిందని నేను భావిస్తున్నా. ధోనీది కోపం కాదు. అంపైర్ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమై చేయి ఎత్తి.. మళ్లీ వెనక్కితీసుకోకూడదు.

నా ముందే క్షమాపణలు చెప్పాడు..
మేం గెలిచాం కాబట్టి సరిపోయింది. లేకుంటే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేవి. ఆ తర్వాత కూడా మేం ఇలాంటి విజయాలు సాధించాం. ఏ ఒక్కరి వల్లనో విజయాలు దక్కలేదు. పరిస్థితులకు తగ్గట్టు ఆటగాళ్లు ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నారు. ఆ మ్యాచ్ ముగిసాక ధోనీ అంపైర్లకు క్షమాపణలు చెప్పాడు. అప్పుడు నేనక్కడే ఉన్నా. ఇక సిక్స్ కొట్టడానికి స్టోక్స్ ఓ మంచి బంతి వేసాడు. చాలా సంతోషం వేసింది.'అని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
కుక్కలు మొరుగుతూనే ఉంటాయ్.. ట్రోలర్స్‌కు మహ్మద్ షమీ వైఫ్ కౌంటర్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications