న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కీలక భేటీకి డుమ్మా: జిలేబీ తింటూ గంభీర్ భలేగా దొరికిపోయాడే, తీవ్ర విమర్శలు!

 Massive row as Gautam Gambhir skips key Delhi pollution meet; Kejriwal’s false propaganda, says ex-cricketer

హైదరాబాద్: దేశ రాజధానిని ప్రస్తుతం ప్రధానంగా పట్టిపీడిస్తోన్న సమస్యం వాయు కాలుష్యం. ఢిల్లీలో మాస్కులు లేనిదే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం అంశంపై పార్లమెంట్‌ ప్యానెల్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది.

ఢిల్లీ కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం అవుతుందని, దీనికి హాజరు కావాలంటూ వారం రోజుల క్రితమే తూర్పు ఢిల్లీ లోక్‌సభ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశానికి గౌతమ్‌ గంభీర్‌ డుమ్మా కొట్టాడు.

డబుల్ కాదు ట్రిపుల్: కోహ్లీ కోరిక తీర్చలేకపోయిన మయాంక్ అగర్వాల్ (వీడియో)

మొత్తం 29 మంది ఎంపీలకుగానూ కేవలం నలుగురు మాత్రమే హాజరు కావటంతో సమావేశాన్ని రద్దు చేశారు. ఈ ఘటనపై పార్లమెంట్‌ ప్యానెల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సమావేశానికి గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటామని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు.

కీలక సమావేశానికి గౌతమ్‌ డుమ్మా కొట్టడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు గుప్పించింది. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి గంభీర్ జిలేబీ తింటున్న ఫొటోను జత చేసి "ముందు మీరు ఎంజాయ్‌ చేయడం ఆపి వాయు కాలుష్యంపై జరిగే సమావేశాల్లో హాజరవండి" కామెంట్ పెట్టింది.

అంతేకాదు కాలుష్య నివారణ చర్యలపై గంభీర్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని #ShameOnGautamGambhir ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నాడు.

సిక్స్‌తో డబుల్ సెంచరీ: కాంబ్లీ, బ్రాడ్‌మన్‌ల ఎలైట్ జాబితాలోకి మయాంక్ అగర్వాల్

దీంతో నెటిజన్లు గౌతమ్‌ తీరును తప్పుపడుతున్నారు. "ప్రజలు నిన్ను గెలిపించినందుకు నువ్వు తగిన శాస్తి చేస్తున్నావు" అని ఓ నెజిటన్ కామెంట్ పెట్టగా... మరొక నెటిజన్ "ఇక్కడ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే నువ్వు ఇండోర్‌లో జిలేబీలు తింటూ ఎంజాయ్‌ చేస్తున్నావా?" ట్వీట్ చేశాడు.

మరోవైపు గంభీర్ కూడా ఆమ్‌ఆద్మీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. తన పనితనమే తన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందని అన్నాడు. ఢిల్లీ కాలుష్యంపై "మా నియోజకవర్గంలో 'జాయింట్ ఏయిర్ ప్యూరిఫైయర్స్' అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్యాన్ని తగ్గించడానికి చర్చలు ప్రారంభించాం. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్‌ను కూడా ప్రారంభిస్తాం" అని గంభీర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.

Story first published: Friday, November 15, 2019, 19:04 [IST]
Other articles published on Nov 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X