
228 పరుగుల ఆధిక్యంలో భారత్
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌పై 228 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో
ఈ క్రమంలో టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌కు చెందిన వినోద్ కాంబ్లి కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు డబుల్ సెంచరీలు సాధించగా... ఆస్ట్రేలియా లెజెండర్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు.

ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం
వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం లారెన్స్ రోయి 14 ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ బాక్సింగ్ డే టెస్టులో 76, 42 పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో 77 పరుగులతో ఫరవాలేదనిపించాడు.

విశాఖలో సఫారీలపై డబుల్ సెంచరీ
అనంతరం వెస్టిండిస్ పర్యటనలో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ సొంతగడ్డపై ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన మయాంక్ ఈ మ్యాచ్‌లో సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో
ఆ తర్వాత పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇలా ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 700కుపైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మయాంక్ అగర్వాల్ తర్వాత రోహిత్ శర్మ(630), క్వింటన్ డీకాక్(629), బెన్ స్టోక్స్(627) ఉన్నారు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు:
5 V Kambli
12 M AGARWAL
13 D Bradman
14 L Rowe


Click it and Unblock the Notifications












