Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హవ్వా.. సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదా? ఐసీసీపై మాజీ క్రికెటర్ల ఫైర్..!!

Mark Waugh questions ICC decision of not scheduling reserve day for semi-finals in women’s T20 World Cup

ముంబయి: మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించకపోవడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. భారత్-ఇంగ్లండ్‌ మధ్య గురువారం జరగాల్సిన తొలి సెమీస్ మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో హర్మన్‌ప్రీత్ సేన నేరుగా ఫై‌నల్‌కు అర్హత సాధించింది. దీంతో ఆసీస్ మాజీ ప్లేయర్స్ మార్క్‌వా, మైఖెల్ వాన్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీసీది పూర్తిగా అర్థరహితమైన చర్యగా అభివర్ణించారు. జీవితకాలంలోనే అతిపెద్ద మ్యాచ్‌ ఆడే అవకాశాన్ని కొందరు క్రికెటర్లు కోల్పోయారని స్టీవ్ వా ఆవేదన వ్యక్తం చేయగా.. రిజర్వ్ డే లేకపోవడం సిగ్గు చేటని మైఖెల్ వాన్ ట్వీట్ చేశాడు.

ఆస్ట్రేలియా కోరినా..

అయితే వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో రిజర్వు డే కేటాయించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా ముందుగానే ఐసీసీని కోరింది. అయినా రిజర్వ్ డే కేటాయించడం కుదరదని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో లీగ్‌ దశలో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించిన భారత్ ఫైనల్‌కు చేరింది. మూడు విజయాలే సాధించిన ఇంగ్లండ్‌ నిరాశగా నిష్ర్కమించింది.

అర్థ రహితం..

అయితే ఈ ఫలితం అనంతరం ఓ జర్నలిస్ట్ రిజర్వ్ డే లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు బదులిస్తూ మార్క్ వా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ ఏడాది అతిపెద్ద క్రికెట్‌ టోర్నీ నాకౌట్‌ మ్యాచులకు ఐసీసీ రిజర్వు డే కేటాయించకపోవడం పూర్తిగా అర్థరహితం. జీవితకాలంలో అతిపెద్ద మ్యాచ్‌ ఆడే అవకాశాన్ని కొందరు క్రికెటర్లు కోల్పోయారు' అని మార్క్‌వా ట్వీట్‌ చేశారు. దానికి కామన్‌ సెన్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

 ఇంగ్లండ్ పాపం పండింది..

ఇంగ్లండ్ పాపం పండింది..

ఐసీసీ నిబంధనలను అడ్డుపెట్టుకునే ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలిచిందనీ.. ఇప్పుడు అవే నిబంధనలు ఇంగ్లండ్ మహిళల జట్టును ఫైనల్‌కు చేరనివ్వలేదని కామెంట్ చేస్తున్నారు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ బౌండరీల నిబంధన ఆధారంగా విశ్వవిజేతగా నిలిచింది. ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన నాటి మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడం.. సూపర్ ఓవర్‌కు దారితీయడం.. సూపర్ ఓవర్ స్కోర్లు కూడా మళ్లీ సమం కావడం.. బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లండ్ గెలిచి టైటిల్ అందుకోవడం అందరికీ తెలిసిందే.

ఇంగ్లండ్ పాపం పండింది.. భారత్ ఫైనల్ చేరింది..!!

ముందే ఊహించాం..

ముందే ఊహించాం..

వర్షం కారణంగా మ్యాచ్‌ జరగకపోవడం దురదృష్టకరమని టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. భవిష్యత్తులోనైనా రిజర్వు డే ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది. అన్ని మ్యాచులు గెలవకపోతే సెమీస్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాము ముందే ఊహించామని వెల్లడించింది. ప్రపంచకప్‌ను ఇలా ముగించడం చిరాకు కలిగించిందని ఇంగ్లండ్‌ కెప్టెన్ హేథర్‌ నైట్‌ తెలిపింది. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికాపై ఓడిపోవడం తమ కొంప ముంచిందని అభిప్రాయపడింది.

Story first published: Thursday, March 5, 2020, 16:43 [IST]
Other articles published on Mar 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+