Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ పాపం పండింది.. భారత్ ఫైనల్ చేరింది..!!

Karma repeats India qualify for maiden final after semi-final washout vs England

హైదరాబాద్: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జైత్రయాత్ర కోనసాగించిన భారత జట్టు తొలి సారి ఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో హర్మన్‌ప్రీత్ సేన నేరుగా టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. భారత మహిళలు ఈ మెగా టోర్నీ ఫైనల్ చేరడం పట్ల యావత్ భారతం హర్షిస్తోంది. అమ్మాయిలపై ప్రశంసల జల్లు కురిపిస్తూ టైటిల్ ఫైట్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతోంది. అయితే కొందరు అభిమానులు ఇంగ్లండ్ పాపం పండిందే కాబట్టే సెమీస్ మ్యాచ్ వర్షంతో రద్దయిందని కామెంట్ చేస్తున్నారు.

కర్మ రిపీట్..

ముఖ్యంగా 2019 పురుషుల వన్డే ప్రపంచకప్ ఫైనల్ విషయాన్ని ప్రస్తావిస్తూ కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు. కర్మసిద్ధాంతం ప్రకారం మనిషి చేసే పనులకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. అది మంచైనా.. చెడైనా.. ప్రతిఫలం అనుభవించక తప్పదు. అయితే ఈ సిద్ధాంతాన్నే ఇంగ్లండ్‌ జట్టుకు అన్వయిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

అప్పుడు నిబంధనలతోనే గెలిచారు..

ఐసీసీ నిబంధనలను అడ్డుపెట్టుకునే ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలిచిందనీ.. ఇప్పుడు అవే నిబంధనలు ఇంగ్లండ్ మహిళల జట్టును ఫైనల్‌కు చేరనివ్వలేదని కామెంట్ చేస్తున్నారు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ బౌండరీల నిబంధన ఆధారంగా విశ్వవిజేతగా నిలిచింది. ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన నాటి మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడం.. సూపర్ ఓవర్‌కు దారితీయడం.. సూపర్ ఓవర్ స్కోర్లు కూడా మళ్లీ సమం కావడం.. బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లండ్ గెలిచి టైటిల్ అందుకోవడం అందరికీ తెలిసిందే.

హే భగవాన్.. క్యా‘కరోనా'.. ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు..!!

అప్పుడు నిబంధనలతోనే గెలిచారు..

ఐసీసీ నిబంధనలను అడ్డుపెట్టుకునే ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలిచిందనీ.. ఇప్పుడు అవే నిబంధనలు ఇంగ్లండ్ మహిళల జట్టును ఫైనల్‌కు చేరనివ్వలేదని కామెంట్ చేస్తున్నారు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ బౌండరీల నిబంధన ఆధారంగా విశ్వవిజేతగా నిలిచింది. ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన నాటి మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడం.. సూపర్ ఓవర్‌కు దారితీయడం.. సూపర్ ఓవర్ స్కోర్లు కూడా మళ్లీ సమం కావడం.. బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లండ్ గెలిచి టైటిల్ అందుకోవడం అందరికీ తెలిసిందే.

అప్పుడు అదృష్టం..

అప్పుడు అదృష్టం..

వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పుడు ఎంత అదృష్టవంతులమని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫీలయ్యారో.. ఇప్పుడు దురదృష్టవంతులమని భావిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇంగ్లండ్ కప్ గెలిచినా.. ఇప్పటికీ న్యూజిలాండ్ విశ్వవిజేతని కూడా కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చివరకు ఈ బౌండరీల నిబంధనను కూడా మార్చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ పాపం పండింది కాబట్టే ఒకే వేదికగా జరగాల్సిన రెండు సెమీస్ మ్యాచ్‌ల్లో ఒకటి రద్దయి.. మరొకటి జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

ఫిర్యాదు దేనికి..

సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడం ఏంటని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు ప్రశ్నించడాన్ని కూడా అభిమానులు తప్పుబడుతున్నారు. బౌండరీల నిబంధనల ప్రకారం గెలిచినప్పుడు ఇప్పుడు.. వర్షం కారణంగా ఇంటి ముఖం పట్టారని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. దీనిలో ఫిర్యాదు చేయడానికి ఏం ఉందని మండిపడుతున్నారు.

Story first published: Thursday, March 5, 2020, 15:47 [IST]
Other articles published on Mar 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+