For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత జట్టుకు మరో యువరాజ్ సింగ్ కావాలి!!

 Sanjay Manjrekar Says India should look to unearth batsmen like Yuvraj Singh, Suresh Raina for middle order


హైదరాబాద్: యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ టీమిండియా మిడిలార్డర్‌కు సరిగ్గా సరిపోయే బ్యాట్స్‌మన్ అని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అయితే యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తరహా బ్యాట్స్‌మెన్‌పై టీ‌మ్‌మెనేజ్‌మెంట్ దృష్టి సారించాలన్నాడు.
కరోనాతో సరదాగా..

కరోనాతో సరదాగా..

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టోర్నీలు రద్దవ్వడం.. నగరాలన్నీ లాక్ డౌన్ కావడంతో స్టార్ క్రికెటర్లు, కామెంటేటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. స్వియ నిర్బంధంలో ఉంటూ కరోనాపై పోరాడాలని అభిమానులకు సూచిస్తున్నారు. అయితే చాలా మంది క్రికెటర్లు ఈ ఖాళీ సమయంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ కూడా అభిమానులతో ట్విటర్ వేదికగా చిట్‌చాట్ నిర్వహించాడు.

టీమిండియా బ్యాడ్‌ డేను గుర్తు చేసిన పాంటింగ్.. బ్యాట్‌ స్ప్రింగ్ ఎక్కడా? అంటూ ఫ్యాన్స్ ఫైర్

రాహుల్ ఫిట్.. కానీ

రాహుల్ ఫిట్.. కానీ

ఈ సందర్బంగా ఓ అభిమాని వన్డే‌ల్లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ సరిపోతాడా? లేక ఇతర బ్యాట్స్‌మన్ అవసరమా? అని ప్రశ్నించాడు. దీనికి ఈ ప్రముఖ కామెంటేటర్ సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతానికి రాహులే ఐదో స్థానానికి సరైనవాడు. కానీ యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తరహా బ్యాట్స్‌మెన్ కోసం కూడా మనం వెతుకుతూనే ఉండాలి. ఎందుకంటే రాహుల్ టాపార్డర్‌కు వెళ్లినప్పుడు వీరి అవసరం ఉంటుంది.'అని బదులిచ్చాడు.

పాండ్యా, అయ్యరే..

పాండ్యా, అయ్యరే..

ఇక ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నాలుగో స్థానం, ఆల్‌రౌండర్ స్థానాలకు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లు ఎవరిని ప్రశ్నించగా.. శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా అని మంజ్రేకర్ సమాధానమిచ్చాడు. ఇక 37 టెస్ట్‌లు, 74 అంతర్జాతీయ వన్డేలు ఆడిన మంజ్రేకర్ ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతుంటాడు. ఈ తరహా ప్రవర్తనతోనే ఈ ఏడాది బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్‌ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

అప్పుడు యువీ, రైనా ..

అప్పుడు యువీ, రైనా ..

ఇక టీమిండియాకు చిరస్మరణీయ విజయాలందించిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన 17 ఏళ్ల వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేయగా.. సురేశ్ రైనా 226 మ్యాచ్‌ల్లో 5,615 రన్స్ చేశాడు. ఇక భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్‌లలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా యువీ కీలక పాత్ర పోషించాడు. రైనా కూడా క్లిష్ట స్థితిలో జట్టును తన బాధ్యాతాయుతమైన ఆటతో ఆదుకున్నాడు.

Story first published: Monday, March 23, 2020, 20:31 [IST]
Other articles published on Mar 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+