
ధోనీ, కోహ్లీ నా ఫేవరేట్.. కానీ,
ఈ చిట్‌చాట్‌లో ఓ అభిమాని మహేశ్‌బాబును ఫేవరేట్ క్రికెటర్స్ ఎవరని ప్రశ్నించాడు. దీనికి మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీలని సూపర్ స్టార్ బదులిచ్చాడు. కానీ తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పుకొచ్చాడు.

ధోనీ సిక్సర్ గుర్తొచ్చింది..
భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరై ఆ అద్భుత క్షణాలను కళ్లారా చూసిన మహేశ్ బాబు.. క్రికెట్‌పై తనకున్న మక్కువను తన ‘మహర్షి' మూవీ సక్సెస్ ఈవెంట్‌లో చాటుకున్నాడు. ఆ కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన తర్వాత ఆ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సిక్సర్ అని చెప్పగానే తనకు 2011 ప్రపంచకప్‌లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్సర్ గుర్తుకొచ్చిందన్నాడు.

డెవిడ్ వార్నర్ అదరగొట్టాడు..
ఇక క్రికెట్‌లో ఏ ఫార్మాట్ ఇష్టమని ప్రశ్నించగా.. టెస్ట్ క్రికెట్ ఇష్టమని తెలిపాడు. ఇక డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ టిక్‌టాక్ ఎలా ఉందని ప్రశ్నించగా.. వార్నర్ అదరగొట్టాడని కితాబిచ్చాడు. ఇక వార్నర్ తన సతీమణి క్యాండిస్‌తో కలిసి మైండ్‌బ్లాక్ చిందేయగా.. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియోను తీయడానికి తాము 56 సార్లు ప్రయత్నించామని వార్నర్ పేర్కొన్నాడు.

‘సర్కారి వారి పాట' ఫస్ట్ లుక్
సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డేకి కొత్త సినిమా అప్‌డేట్స్ ఇవ్వడం మహేశ్‌బాబు అనవాయితీ. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సినిమాకి ‘సర్కారు వారి పాట' టైటిల్ అని కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. పొడుగు జుట్టు, చెవి పోగు, మెడ మీద రూపాయి బిళ్ల ట్యాటూతో మహేశ్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘మహర్షి, సరిలేరు నీకెవ్వరు' తర్వాత హ్యాట్రిక్‌కి బ్లాక్‌బస్టర్ ఆరంభం ఇది'' అని మహేశ్ బాబు లుక్‌ని రిలీజ్ చేశారు.
మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే అంటూ బోల్డ్ పిక్ షేర్ చేసిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!


Click it and Unblock the Notifications












