టాపర్ ఆఫ్ ది టోర్నమెంట్... పానీపూరి అబ్బాయి యశస్వీ జైస్వాల్ నమోదు చేసిన రికార్డులివే

పోచెఫ్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హాట్ ఫేవరెట్ భారత్‌ను ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. సీనియర్, జూనియర్, పొట్టి, వన్డే ఇలా ఏ ఫార్మాట్ అయినా బంగ్లాదేశ్ ఐసీసీ ప్రపంచకప్ నెగ్గడం ఇదే తొలిసారి. ఇక టోర్నీ ఆసాంతం అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఇండియా.. తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. ఐదోసారి అండర్-19 వరల్డ్‌కప్ గెలిచి రికార్డు సృష్టిద్దామనుకున్న భారత్‌కు.. బంగ్లా ఝలక్ ఇచ్చింది.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యశస్వీ
ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో యశస్వి.. 6 మ్యాచ్‌ల్లో 400 పరుగులు సాధించి, టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో ఒక సెంచరీ సహా 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన యశస్వీ.. ఫైనల్లో 88 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన జైస్వాల్.. ఫైనల్ మ్యాచ్‌లో కీలక వికెట్‌తో పాటు మొత్తం 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
మా వాళ్లు కొంచెం ఓవర్ చేశారు.. అలా చేయాల్సింది కాదు : బంగ్లా అండర్-19 కెప్టెన్

ధావన్ తర్వాత యశస్వినే..
వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ (400) రికార్డుకెక్కాడు. 2004లో 505 పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా 400 అంతకన్న ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో యశస్వీ 8వ బ్యాట్స్‌మన్.

మూడో బ్యాట్స్‌మన్‌గా..
అండర్-19 ప్రపంచకప్‌లో వరుసగా ఐదు 50 ప్లస్ స్కోర్లు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా జైస్వాల్ గుర్తింపు పొందాడు. బ్రెట్ విలియమ్స్ (ఆస్ట్రేలియా), సర్ఫరాజ్ ఖాన్(భారత్) రికార్డును యశస్వీ సమం చేశాడు. ఇక వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి నాలుగో బ్యాట్స్‌మన్‌గా రికార్డుకెక్కాడు. 2016లో మెహ్‌ది హసన్ మీర్జా, శుభ్‌మన్ గిల్ ఈ ఘనతనుందుకోగా.. నీయిమ్ యంగ్ 2018లో ఈ ఫీట్ సాధించాడు.

అత్యధిక సిక్స్‌లు...
ఈ కుర్రాళ్ల మెగా ఈవెంట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితా యశస్వి మూడో స్థానంలో నిలిచాడు. ఈ మెగాటోర్నీలో అతను మొత్తం 10 సిక్స్‌లు కొట్టాడు. ఈ జాబితాలో 15 సిక్సర్లతో జాక్ బర్న్‌హమ్ అగ్రస్థానంలో ఉండగా.. సంజూశాంసన్ (12) రెండో స్థానంలో నిలిచాడు.

తొలి భారత ప్లేయర్‌గా..
యూత్ వన్డే క్రికెట్‌లో 15కుపైగా 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు. ఇక ఓవరాల్‌గా రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. సమి అస్లామ్(16) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. టౌహిడ్ హృదయ్(15)తో జైస్వాల్ సంయుక్తంగా నిలిచాడు. యూత్ వన్డేల్లో 1386 పరుగులు చేసిన ఈ ముంబై సెన్సేషన్.. భారత్ తరపున ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. విజయ్ జోల్ (1404) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా యశస్వి ఆరో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

30 సిక్సర్లు.. 150 ఫోర్లు..
యూత్ వన్డే ఫార్మాట్‌లో మొత్తం 30 సిక్స్‌లు బాదిన యశస్వి.. ఈ ఘనతనుందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. 38 సిక్సర్లతో టౌహిడ్ హృదయ్ అగ్రస్థానంలో ఉండగా.. 30 సిక్స్‌లు బాదిన భారత్ ప్లేయర్ ఉన్మక్త్‌చంద్‌తో సంయుక్తంగా యశస్వి రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఫార్మాట్‌లో 150 ఫోర్లు బాదిన యశస్వి ఈ ఘనతనందుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

బ్యాటింగ్‌లో భారత్ విఫలం..
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్ అవిషేక్ దాస్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కప్ కొట్టేందుకు 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక బంగ్లాదేశ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలబడి గెలిపించాడు. రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications