'నన్ను కోచ్గా తీసుకోండి.. రిజల్ట్ చూపిస్తా': సంజీవ్ గోయెంకాకు తమిళనాడు దిగ్గజం ఆఫర్!
ఐపీఎల్ 2027 సీజన్ కోసం ప్లేయర్లను రీటైన్ చేసుకోవడానికి, రిలీజ్ చేయడానికి నవంబర్ 15 వరకు గడువు ఉంది. అయితే ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కంటే ముందు తమ కోచింగ్ స్టాఫ్ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఇప్పటికే ముంబై, చెన్నై, ఢిల్లీ జట్లు తమ కోచింగ్ బృందాల్లో మార్పులు చేయగా.. ఇప్పుడు తమిళనాడు దిగ్గజ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఐపీఎల్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపించారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతూ.. ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకాను సోషల్ మీడియా వేదికగా ఆయన నేరుగా కోరారు.
సోషల్ మీడియా వేదికగా శివరామకృష్ణన్ స్పందిస్తూ.. "టీ20 క్రికెట్లో స్పిన్నర్లు కూడా మ్యాచ్ విన్నర్లుగా మారగలరని నిరూపించి చూపిస్తాను. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అందిస్తాను" అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ చెప్పిన "మనం అడిగితేనే ఏదైనా దక్కుతుంది" అనే సూక్తిని గుర్తుచేస్తూ.. ఇది కేవలం లక్నో జట్టుకే కాకుండా స్పిన్ విభాగంలో సహాయం కావాలనుకునే ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీకైనా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ కార్ల్ క్రో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో కలిసి పనిచేసిన ఆయన.. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. లక్నో యాజమాన్యం కార్ల్ క్రోను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. శివరామకృష్ణన్ చేసిన ఈ పోస్ట్ ఐపీఎల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
గత ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో స్పిన్ బౌలింగ్ విభాగం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మణిమారన్ సిద్ధార్థ్ 4 మ్యాచుల్లో 6 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా.. దిగ్వేష్ రాఠీ 10 మ్యాచుల్లో కేవలం 5 వికెట్లు, షాబాజ్ అహ్మద్ 5 మ్యాచుల్లో5 వికెట్లు మాత్రమే తీశారు. ప్రధానంగా మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించడంలో క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో లక్నో స్పిన్నర్లు తీవ్రంగా తడబడ్డారు. ఈ నేపథ్యంలో లక్నో స్పిన్ విభాగానికి కొత్త దిశ చూపిస్తానని శివరామకృష్ణన్ ముందుకు రావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


