ధోనీ రిటైర్మెంట్ వార్తతో నా గుండె పగిలింది: కేఎల్ రాహుల్

బెంగళూరు: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ వార్తతో తన గుండె పగిలిందని యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మహీ భాయ్ ఆకస్మిక నిర్ణయంతో షాక్‌కు కూడా గురయ్యానని కూడా చెప్పుకొచ్చాడు. భారత్ క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇక భారత 74 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం మహీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ వెంటనే రైనా కూడా మహీ బాటలోనే నడుస్తానని అంతర్జాతీయ ఆటకు అల్విదా ప్రకటించాడు. దీంతో అభినులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు షాక్‌కు గురయ్యారు. ధోనీ సాధించిన ఘనతలను నెమరువేసుకుంటూ అతని భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ధోనీకి వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తే.. మరికొందరూ 2021 టీ20 ప్రపంచకప్ ఆడాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే ధోనీ రిటైర్మెంట్‌పై ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోతో మాట్లాడిన రాహుల్ కూడా.. సెండాఫ్ మ్యాచ్ ఆడించాలని అభిప్రాయపడ్డాడు.

ఆ అవకాశం లేకుండా పోయింది..
‘ధోనీ రిటైర్మెంట్ వార్త షాక్‌కు గురిచేసింది. నిజాయితీగా చెప్పాలంటే నా గుండె ఆగినంత పనైంది. నాతో పాటు ధోని సారథ్యంలో ఆడిన ప్రతీ క్రికెటర్ ఇలాంటి ఉద్వేగానికి లోనై ఉంటారు. తనకు వీడ్కోలు చెబుతూ స్పెషల్‌గా ఫేర్‌వెల్ ఏర్పాటు చేసే వీల్లేకుండా పోయింది.
జట్టులోని ప్రతి ఆటగాడికి ధోని పూర్తి స్వేచ్చనిచ్చేవాడు. ఎలా ఆడాలో చెబుతూనే మా సహజత్వాన్ని కోల్పోకుండా, మా తప్పుల్ని మేమే తెలుసుకునేలా గైడ్ చేసేవాడు. మమ్మల్ని మాలాగే ఉంచిన ఘనత ధోనీకే దక్కుతుంది. ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే మొదటగా పరిగెత్తుకు వెళ్లేది ధోని దగ్గరికే. తనెప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపేందుకు సిద్ధంగా ఉండేవాడు. ధోనికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.’అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

పదాలు దొరకలేదు..
ఇక ధోనీ రిటైర్మెంట్ వార్త విన్న తర్వాత అతని గొప్పతనం గురించి సోషల్ మీడియాలో రాద్దామంటే పదాలు దొరకలేదని రాహుల్ చెప్పుకొచ్చాడు. జీవితాలను మార్చగలిగే సామర్థ్యం ఉన్న ధోనీ సారథ్యంలో ఆడటం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ‘రిటైర్మెంట్ సందర్భంగా ధోనీ గొప్పతనం గురించి ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ రాద్దామంటే పదాలు దొరకలేదు. లెజండరీ ఆటగాడి గురించి ఏమని చెప్పను. ఎలా అని రాయను.

మహీ భాయ్ నా రోల్ మోడల్..
మహీ భాయ్ తన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచాడు. మరెంతో మంది జీవితాలు మార్చాడు. మైదానంలోనేకాదు ఆఫ్ ది ఫీల్డ్‌లో కూడా ధోనీ భాయ్ ఎన్నో చేశాడు. మరేన్నో ఘనతనలు అందుకున్నాడు. అతనో అసాధారణమైన ఆటగాడు. అలాంటి ధోనీ సారథ్యంలో నేను ఆడినందుకు ఎంతో గౌరవంగా, నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. అతనే నా రోల్ మోడల్'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఫుల్ టైమ్ కీపర్‌గా..?
ఇక మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌తో భారత జట్టు వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ పూర్తి స్థాయి బాధ్యతలు చెపట్టునున్నాడా.? లేక రిషభ్ పంత్‌కు మరో అవకాశం ఇస్తారా? అనేచర్చ ఊపందుకుంది. పంత్ గైర్హాజరీలో వికెట్ల వెనుకాల అదరగొట్టిన రాహుల్.. అటు బ్యాటింగ్‌లోనూ మెరిసాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో తన కీపింగ్‌తో ధోనీ లేని లోటు తీర్చాడు. దీంతో రాహులే ధోనీ వారుసుడనే వాదన చాలా బలంగా వినిపించింది. ఇక దేశవాళీ, ఐపీఎల్‌లో మాత్రమే కీపింగ్ చేసిన రాహుల్.. ధోనీ రిటైర్మెంట్‌తో పూర్తిస్థాయి కీపర్‌గా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఐపీఎల్ 2020 సీజన్‌తో కొంత క్లారిటీ రావచ్చంటున్నారు.
CPL 2020: అప్‌గ్రేడేడ్ హెలికాప్టర్ షాట్‌తో రఫ్ఫాడించిన రషీద్ ఖాన్.!(వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications