Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: అప్‌గ్రేడేడ్ హెలికాప్టర్ షాట్‌‌తో రఫ్ఫాడించిన రషీద్ ఖాన్.!(వీడియో)

 CPL 2020: Watch Rashid Khan Stuns Everyone With Outrageous Six and Super Fielding

ట్రినిడాడ్: కరోనా విరామం అనంతరం ప్రారంభమైన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ రఫ్ఫాడించాడు. బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన రషీద్ ఖాన్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ జట్టుతో జరిగిన లీగ్ రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణించి ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు.భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు జరిగిన ఈ మ్యాచ్‌లో రషీద్‌ఖాన్ (26 నాటౌట్, 2/27) సూపర్ పెర్ఫామెన్స్‌‌కు తోడు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ సాంట్నర్(2/18) సూపర్ బౌలింగ్‌తో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టు 6 పరుగులతో గెలిచి లీగ్‌లో శుభారంభాన్ని అందుకుంది.

అప్‌గ్రేడేడ్ హెలికాప్టర్ షాట్..

8 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కైల్ మేయర్స్(37), కెప్టెన్ జాసన్ హోల్డర్ (38) గట్టెక్కించగా.. 101/7 వికెట్లు పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన రషీద్.. సాంట్నర్ సాయంతో ధనాధన్ బ్యాటింగ్‌తో పోరాడే స్కోర్ 153/9ను ప్రత్యర్థి ముందుంచాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్స్‌తో 26 పరుగులు చేసిన రషీద్.. ఆ ఒక్క సిక్స్‌ను కూడా అద్భుత రీతిలో కొట్టాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్రేడ్ మార్క్ షాట్ హెలికాప్టర్ షాట్‌కు అప్‌గ్రేడా? అన్నట్లు సిక్సర్‌ను బాదాడు. ప్రత్యర్థి పేసర్ అల్జారీ జోసేఫ్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా బంతిని భారీ షాట్‌తో స్టాండ్స్‌కు తరలించాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సూపర్ రనౌట్..

అనంతరం సూపర్ బౌలింగ్‌తో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్.. సూపర్ ఫీల్డింగ్‌తో ఓపెనర్ ఎవిన్ లూయిస్(12)‌ను రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. రషీద్ ఖాన్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతిని బ్యాట్స్‌మన్ జోషువా డా సిల్వా స్ట్రేట్ డ్రైవ్ ఆడగా.. బంతి నేరుగా వికెట్లను తాకింది. ఇక నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న ఎవిన్ లూయిస్ పరుగుకోసం క్రీజును వీడగా.. బంతిని అందుకున్న రషీద్ అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. చాకచక్యంగా వ్యవహరించి లూయిస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

రషీద్ మెరుపులు..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బార్బోడస్ ట్రిడెంట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులే చేసింది. కైల్ మేయర్స్(37), కెప్టెన్ జాసన్ హోల్డర్ (38) ఫర్వాలేదనిపించగా.. చివర్లో సాంట్నర్(20), రషీద్ ఖాన్(26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో బార్బోడస్ జట్టు ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. సెయింట్ కిట్స్ బౌలర్లలో సోహైల్ తన్వీర్(2/25), షెల్డన్ కాట్రెల్(2/16), రాయద్ ఎమ్రిత్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్(1/48), ఇష్ సోధీ(1/40)తలొక వికెట్ తీశారు.

డా సిల్వా పోరాడినా..

డా సిల్వా పోరాడినా..

అనంతరం ఛేజింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ టీమ్.. బార్బోడస్ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో జోషువా డా సిల్వా(41 నాటౌట్), సోహైల్ తన్వీర్(16 నాటౌట్) ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బెన్ డంక్(34) ఫర్వాలేదనిపించగా.. విధ్వసంకర బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్(19) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బార్బోడస్ బౌలర్లలో రషీద్ ఖాన్(2/27), మిచెల్ సాంట్నర్(2/18)రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ సూపర్ రనౌట్‌కు ఎవిన్ లూయిస్(12) పెవిలియన్ చేరాడు. ఇక మిచెల్ సాంట్నర్ ఓ ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడం బార్బోడస్ జట్టు విజయానికి కలిసొచ్చింది.

Story first published: Wednesday, August 19, 2020, 15:44 [IST]
Other articles published on Aug 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+