న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మాట అనడానికి సిగ్గుండాలి రాహుల్.. క్రీడా స్పూర్తి అంటే ఇదేనా? హైదరాబాద్ ఫ్యాన్స్ ఫైర్!

KL Rahuls David Warner injury remark invites sharp criticism from cricket fans

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు అయిన గాయం పెద్దదైతే బాగుండని టీమిండియా వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్ కేఎల్‌ రాహుల్‌ అన్న వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాట చెప్పడానికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇదేం క్రీడాస్పూర్తి అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. రాహుల్ సరదాగా అన్న వ్యాఖ్యలను కూడా ఫ్యాన్స్ సిరీయస్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రాహుల్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

 ఇంతకీ ఏం జరిగిందంటే.?

ఇంతకీ ఏం జరిగిందంటే.?

ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీసేన బ్యాటింగ్‌ చేస్తుండగా వార్నర్‌ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం స్పందించిన రాహుల్‌.. అతనికైన గాయం ఎక్కువ రోజులుంటే బాగుండని సరదాగా చెప్పుకొచ్చాడు. అలా జరగాలని తాను ఏ క్రికెటర్‌ విషయంలో కోరుకోనని చెబుతూనే.. వార్నర్ ఆసీస్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌ అయినందున ఇలా సరదాగా అంటున్నానని స్పష్టం చేశాడు. ఒకవేళ అదే జరిగితే భారత్‌కు కలిసి వస్తుందన్నాడు. మరోవైపు వరుసగా రెండు వన్డేల్లో ఓడినా తమ జట్టు ఇంకా సానుకూలంగా ఉందని స్పష్టం చేశాడు.

ఇదేం క్రీడాస్పూర్తి..

ఇదేం క్రీడాస్పూర్తి..

ఇక రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘ఓ క్రీడాకారుడైన రాహుల్.. డేవిడ్ వార్నర్ గాయం ఎక్కువ రోజులుండాలని కోరుకోవడం సిగ్గు చేటు. ఇదేం క్రీడా స్పూర్తినో ఏమో'అని ఓ ట్విటర్ యూజర్ కామెంట్ చేశాడు. ఈ తరహా వ్యాఖ్యలతో రాహుల్ తనపై ఉన్న గౌరవన్నా తగ్గించుకున్నాడని మరొకరు ట్వీట్ చేశారు. కాఫీ విత్ కరణ్ షో నుంచి రాహుల్ గుణపాఠం నేర్చుకోలేకపోయాడని ఇంకొకరు కామెంట్ చేశారు.

టీ20 సిరీస్ నుంచి ఔట్

టీ20 సిరీస్ నుంచి ఔట్

గాయం తీవ్రత కారణంగా వార్నర్ నామమాత్రపు మూడో వన్డేతో పాటు తర్వాత ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్పష్టం చేశాడు. వార్నర్‌ స్థానాన్ని జాన్‌ మాథ్యూ షార్ట్‌ భర్తీ చేస్తాడని తెలిపాడు. అలాగే తమ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలుపొందడంతో.. టెస్టు సిరీస్‌కు ముందు ప్రధాన పేసర్‌ పాట్‌ కమిన్స్‌కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నట్లు ఆసీస్‌ కోచ్‌ తెలిపాడు. అతని స్థానంలో డీఆర్సీ షార్ట్‌ను టీ20 జట్టులోకి తీసుకున్నారు.వార్నర్‌, కమిన్స్‌ తమకు కీలక ఆటగాళ్లని, రాబోయే టెస్టు సిరీస్‌లో వాళ్లు రాణించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని చెప్పాడు. డిసెంబర్‌ 17 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌ తమకెంతో ముఖ్యమని అన్నాడు. ఆ సిరీస్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.

విరాట్‌ కోహ్లీకి కెప్టెన్సీ భారం కాదు.. అండగా నిలిచిన వెటరన్ క్రికెటర్

Story first published: Monday, November 30, 2020, 15:44 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X