న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Aus, 2nd ODI Trolls: రోహిత్ లేకుంటే ఇలానే ఉంటుంది.. ఓ రవిశాస్త్రి నిద్రపోతున్నావా?

Virat Kohli and Ravi Shastri brutally trolled trolled after Australia beat India by 51 runs in 2nd ODI

హైదరాబాద్: కరోనా బ్రేక్ అనంతరం ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు వరుస ఓటములతో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. పేలవ ఆటతీరుతో ఫస్ట్ వన్డేలో 66 పరుగులతో చిత్తయిన కోహ్లీ సేన.. ఆదివారం జరిగిన రెండో వన్డేలోనూ 51 పరుగులతో ఓటమిపాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. ఈ వరుస పరాజయాలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ క్రియేటివిటిని బయటకు తీస్తూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

రోహిత్‌నే తీసేస్తారా?

తొడ కండరాల గాయంతో ఈ టూర్‌లోని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మ ఎంపిక కానీ విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఫిట్‌గా లేకపోవడం ఏందని, ముమ్మాటికీ ఇది కోహ్లీ కుట్రేనని టీమ్ సెలెక్షన్ సమయంలో హిట్ మ్యాన్ అభిమానులు ఆరోపించారు. తాజాగా భారత్ దారుణంగా ఓటమిపాలవడంతో రోహిత్ లేకుంటే ఇలానే ఉంటుందని, మంచిగైందని కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ లేకుండా భారత్ ఓడిన మ్యాచ్‌ల వివరాలను ట్విటర్ వేదికగా షేర్ చేస్తున్నారు.

కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకో..

ఆస్ట్రేలియా పర్యటన ముంగిట రోహిత్ శర్మకి వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని.. విరాట్ కోహ్లీని కేవలం టెస్టులకే కెప్టెన్‌గా పరిమితం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపించింది. తాజా ఓటములతో ఆ డిమాండ్‌కి మరింత సపోర్ట్‌ లభిస్తుంది. పైగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ కెప్టెన్సీ తప్పిదాలు కూడా జట్టు ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా మైదానంలో విరాట్ తీసుకున్న నిర్ణయాలన్నీ బెడిసి కొట్టాయి. దాంతో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

రవిశాస్త్రి ఏం చేస్తున్నావ్..?

రవిశాస్త్రి కోచింగ్ సామర్థ్యంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ గడ్డపై అతని పర్యవేక్షణలో టీమిండియా చెప్పుకోదగ్గ విజయాల్ని సాధించలేకపోతున్న తీరుని నెటిజన్లు ఎండగడుతున్నారు. మూడు వన్డేల సిరీస్‌ని ఇప్పటికే 0-2తో ఆస్ట్రేలియాకి చేజార్చుకున్న భారత్ జట్టు.. నామమాత్రమైన మూడో వన్డేని కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఆడనుంది. ఆ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లను ఆడనున్న నేపథ్యంలో.. టీమిండియా పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆసీస్ ఆటగాళ్ల తొండి..

ఐపీఎల్ 2020 సీజన్‌లో దారుణంగా విఫలమైన ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తాజా సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నారు. దాంతో ఆయా ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అభిమానులు విస్మయానికి గురిచేస్తున్నారు. ఇది తొండాట అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఐపీఎల్‌లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డ ఈ ముగ్గురు ఇప్పుడేమో భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారని, ఇది పక్కా స్కామ్ అంటూ ఫన్నీమీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Story first published: Monday, November 30, 2020, 10:44 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X