Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నగ్నచిత్రాలు బయటపెడ్తానని బెదిరిస్తున్నాడు.. పాక్ క్రికెటర్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు

Dubai woman accuses Pakistan cricketer Shadab Khan of Vulgar Blackmail

దుబాయ్ : పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తాజాగా ఓ మహిళ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. దుబాయ్‌కు చెందిన అష్రినా సాఫియా అనే మహిళ తన నగ్న చిత్రాలు బయటపెడ్తానని షాదాబ్‌ఖాన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది.

తమ మధ్య ఉన్న సంబంధం ప్రపంచానికి తెలియడంతో.. ఆ వార్తలను ఖండించాలని షాదాబ్ తనపై ఒత్తిడి తెస్తున్నాడని, లేకుంటే నగ్న చిత్రాలు బయట పెడ్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌లో తన గోడు వెళ్లబోసుకుంది.

2019లో పరిచయం..

2019లో పరిచయం..

2019లో షాదాబ్‌తో పరిచయమైందని, ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచకప్ సందర్భంగా తమ బంధం మరింత బలపడిందని పేర్కొంది. దాంతో తామిద్దరం చెట్టాపట్టాలేసుకొని చాలా దేశాలు తిరిగామని చెప్పుకొచ్చింది. వివిధ దేశాల్లో షాదాబ్ పాల్గొన్న క్రికెట్ టోర్నీలకు తన సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని వెళ్లానని కూడా పేర్కొంది.

మీడియాకు తెలియడంతో..

ఈ క్రమంలో తాము సాన్నిహిత్యంగా ఉన్న సందర్భంలో ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ ఫోటో తీసాడని, అది కాస్త వైరల్ అవ్వడంతో తమ రిలేషన్ ‌గురించి ప్రపంచానికి తెలిసిందని సాఫియా తెలిపింది. అయితే ఈ వార్తలను ఖండించాలని, తాను కేవలం అభిమానిని మాత్రమేనని మీడియాకు చెప్పాలని షాదాబ్ తనపై ఒత్తిడి చేస్తున్నాడని ఆ సుదీర్ఘ పోస్ట్‌లో ఆరోపించింది. లేకుంటే తన నగ్నచిత్రాలు, బయట పెడ్తానని బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చింది. తనతో షాదాబ్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్, బెదిరింపు మెసేజ్‌లను కూడా సాఫియా తన సోషల్ మీడియా ఖాతాల్లో బహిర్గతం చేసింది.

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

ఇక పాకిస్థాన్ క్రికెటర్లపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇమామ్ ఉల్ హక్, షాహీన్ షా అఫ్రీది కూడా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలువురి మహిళలతో ఇమామ్ అసభ్యంగా చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షాహీన్ షా అప్రీదీ వీడియోకాల్‌లో ఓ మహిళలను ఎక్స్ పోజింగ్ చేయమన్నట్లుఆరోపణలు ఎదుర్కొన్నాడు.

చివరిగా బంగ్లాదేశ్‌తో..

చివరిగా బంగ్లాదేశ్‌తో..

ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన షాదాబ్ ఖాన్.. రెండు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు తీశాడు. ఇక ఈ ఆలౌరౌండర్‌కు బ్యాటింగ్ చేసే అవకా శం రాలేదు. ఇక షాదాబ్ పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయంగా 5 టెస్ట్‌లు, 43 వన్డేలు, 40 టీ20లు ఆడాడు. ఇక ఆరోపణలపై ఇంకా అతను స్పందించలేదు.

Story first published: Tuesday, February 11, 2020, 19:30 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+