న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs DC Trolls: ధోనీ భయ్యా.. నీ నుంచి కాదు గానీ, కరోనా వచ్చిందని భారత్‌కు వచ్చేయ్!

MS Dhoni and Other CSK Players Trolled With Hilarious Memes for heavy defeat to DC

దుబాయ్‌: శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అద్భుత విజయాన్నందుకుంది. శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ టీ20 లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో అనుభజ్ఞులతో కూడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. 175 పరుగుల లక్ష్యచేధనలో సీఎస్‌కే పూర్తిగా తడబడింది. సురేశ్ రైనా లేకపోవడం.. గాయంతో రాయుడు దూరమవడం.. ఓపెనర్ల పేలవ ఆటతీరుతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనంగా మారింది. ఈ కారణాలతోనే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మ్యాచ్ విన్నర్ అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా జట్టు అవసరాలకు తగ్గట్టు బ్యాటింగ్‌కు రాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. పేపర్‌పై బలంగా కనిపిస్తున్న ఆ జట్టు మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోతుంది. దీంతో చెన్నై జట్టు ఆటతీరుపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్, జోక్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

CSK vs DC: ధోనీ అలసత్వం.. పృథ్వీ షా హాఫ్ సెంచరీ!CSK vs DC: ధోనీ అలసత్వం.. పృథ్వీ షా హాఫ్ సెంచరీ!

ధోనీ నీ వల్ల కాలేదు..

ఇక చెన్నై జట్టును గెలిపించడం ధోనీ వల్ల కాదని, నాలుగు దగ్గులు దగ్గి కరోనా వచ్చిందని భారత్‌కు వచ్చేయ్.. అని సెటైరిక్‌గా కామెంట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతున్న చెన్నై జట్టు వాటి అందుకోకపోవడంతో ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అభిమానుల అంచనాలు.. రియాల్టీ ఇదంటూ సెటైరికల్ ట్వీట్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. చేజింగ్ రన్‌రేట్ పెరుగుతున్నా ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రాకపోవడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కీలక పరిస్థితుల్లో బాధ్యతను తీసుకొని ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన ధోనీకి ఏమైందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక చెన్నై బ్యాటింగ్ తీరుపై సొంత జట్టే ట్రోల్ చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆ రూ.2 కోట్లు రైనా కోసం ఖర్చు పెట్టుంటే..

మురళీ విజయ్‌ కోసం వేలంలో వెచ్చించిన రూ.2 కోట్లను సురేశ్ రైనా అడిగిన బాల్కనీ కోసం ఖర్చు చేసుంటే.. సీఎస్‌కే‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని మరో అభిమాని కామెంట్ చేశాడు. హోటల్ గదిలో తలెత్తిన బేధాభిప్రాయలవల్లనే రైనా స్వదేశం తిరగివచ్చాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సదరు అభిమాని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక మురళీ విజయ్ గత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మంచి ఆరంభం లేకపోవడంతోనే సీఎస్‌కే బ్యాట్స్‌మన్ ఒత్తిడికి లోనై త్వరగా ఔట్ అవుతున్నారు.

ధోనీ ఓ పక్షి..

ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్బంగా వికెట్ కీపర్ ధోనీ పట్టిన ఓ క్యాచ్‌పై అందరూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. బ్యాటింగ్‌లో తడబడుతున్నా కీపింగ్‌లో అదరగొడుతున్నాడని కొనియాడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌ను ధోనీ అద్భుత డైవ్‌తో అందుకున్నాడు. ఈ క్యాచ్ వేటాడే చిరుత పులిలా ఉందని, ఒకరంటే.. ధోనీ ఓ పక్షి అందుకే అలాంటి క్యాచ్ పడతాడని కామెంట్ చేస్తున్నారు. ఇక ధోనీ సూపర్ పెర్ఫామెన్స్ కోసం అతని అభిమానులు ఎదురుచూస్తున్నారని అది మాత్రం జరగడంలేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

పృథ్వీ షా సూపర్ ఫిఫ్టీ..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' పృథ్వీ షా (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 64 ) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్‌ ), శిఖర్‌ ధావన్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 35) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (35 బంతుల్లో 4 ఫోర్లు 43) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రబడ 3 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, September 26, 2020, 11:15 [IST]
Other articles published on Sep 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X