
ఆర్‌సీబీ జోరు కొనసాగేనా..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐపీఎల్ 2021 తొలి దశలో ఆర్‌సీబీ దుమ్మురేపింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి టైటిల్ ఆశలు రేకెత్తించింది. మునపటి ఫామ్‌ను కొనసాగిస్తే యూఏఈలో కూడా ఆర్‌సీబీకి తిరుగుండదు. కెప్టెన్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ జట్టుకు అందుబాటులో ఉండటంతో బ్యాటింగ్ ఎప్పటిల్లాగే బలంగా ఉంది. పైగా, తమ జట్టు మంచి స్థానంలో ఉండటంతో వీరంతా స్వేచ్చగా ఆడనున్నారు. ఇక, ఈ సీజన్ తర్వాత టీ20 కెప్టెన్సీ వదులుకోనున్న విరాట్‌పైనే ఈసారి అంది దృష్టి నెలకొంది. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సేవలు కోల్పోవడం ఆర్‌సీబీకి కాస్త మైనస్.
అయితే సుందర్ ప్లేస్‌లో విరాట్ ఎవరిని ఫైనల్ ఎలెవన్‌లో తీసుకుంటాడో చూడాలి. బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీకి సమస్యల్లేవు. హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్‌కు తోడుగా హర్షల్ పటేల్, సైనీ, జెమీసన్‌తో లైనప్ బలంగా ఉంది. ఫస్ట్ ఫేజ్‌లో అదరగొట్టిన హర్షల్‌పై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. ఇక, రెగ్యులర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫామ్ జట్టును కాస్త కలవరపెడుతోంది. యువ ప్లేయర్ మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన హసరంగా, చమీరా, టీమ్ డేవిడ్‌లో తుది జట్టులో ఎవరికి అవకాశం దొరకుతుందో చూడాల్సి ఉంది.
CSK vs MI: మహేంద్రుడి మాయాజాలం.. ముంబైకి తప్పని పరాజయం! రివ్యూ తీసుకున్నాడంటే వణుకు పుట్టాల్సిందే!

కేకేఆర్ పుంజుకునెనా?
తొలి దశ మిగిల్చిన చేదు అనుభవాన్ని అధిగమించడమే లక్ష్యంగా నైట్ రైడర్స్ యూఏఈ లెగ్‌ను స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. సరైన కాంబినేషన్‌తో ఫైనల్ ఎలెవన్‌ను ఎంచుకోలేక ఫస్ట్ ఫేజ్‌లో నైట్‌రైడర్స్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. దాన్ని అధిగమించాలంటే టాపార్డర్‌ను బలంగా తయారు చేసుకోవాలి. శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠితో కూడిన టాపార్డర్ ఫస్టాఫ్‌లో అంచనాలు అందుకోలేదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జట్టులో ఉండటం ఖాయం కాగా ఓవర్సీస్ కోటాలో మిగిలిన మూడు స్థానాలకు గట్టి పోటీ ఉంది. ఈ ప్లేస్‌లను ఎవరితో భర్తీ చేస్తారనే దానిపైనే రైడర్స్ భవితవ్యం ఉండనుంది. ఆండ్రీ రస్సెల్‌కు తోడుగా లూకీ ఫెర్గుసన్, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, బెన్ కట్టింగ్ వంటి ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. స్పిన్ కోటాలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్భజన్ ఉండగా, పేస్ కోటాలో కివీస్ స్టార్ టీమ్ సౌథీ కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇతర పేసర్లుగా ప్రసీద్ కృష్ణ, కమలేశ్ నాగర్‌కోటీ, శివమ్ మావి ఉన్నారు.

పిచ్ రిపోర్ట్:
అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం పిచ్ నెమ్మదైనది. మ్యాచ్ జరుగుతున్నా కొద్ది బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారుతుంది. ఈ మైదానంలోని సగటు స్కోర్ 150. అయితే గతేడాది పిచ్‌లో పెరుగుదల కనిపించింది. యావరేజ్‌గా 170 స్కోర్ నమోదైంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపనున్నాడు. వర్షం సూచన లేదు. వాతావరణం 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. తీవ్ర ఉక్కపోతలో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరికానున్నారు. తేమ ప్రభావం కూడా ఉండనుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
ఇరు జట్ల మధ్య ఫస్టాఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేననే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్(78), ఏడీ డివిలియర్స్(76 నాటౌట్) అద్భుత ప్రదర్శన కనబర్చడంతో 38 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 204 పరుగుల భారీ స్కోర్ చేయగా... కేకేఆర్ 166/8 రన్స్‌కే పరిమితమైంది.
CSK vs MI మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. ముంబై ఇండియన్స్ కొంప ముంచిన మూడు తప్పిదాలు ఇవే!

తుది జట్లు: (అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లూకీ ఫెర్గూసన్, కమలేశ్ నాగర్‌కోటి/శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ, ప్రసిధ్ కృష్ణ
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, కైల్ జెమీసన్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications
