
ఏ ఒక్కరికి సందేహం కలగలేదు..
‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గత శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై సందేహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ అఫిషియల్స్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మేమంతా షాక్‌కు గురయ్యాం. నరైన్ 2012 నుంచి ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాకుండా 2015లో సస్సెన్షన్‌ను ఎదుర్కొని ఐసీసీ నిర్వహించిన పరీక్షలను క్లియర్ చేశాడు. ఆ తర్వాత కూడా 68 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సీజన్‌లో ఇప్పటికే 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇన్ని మ్యాచ్‌ల్లో ఏ ఒక్కరు కూడా అతని బౌలింగ్‌పై సందేహం వ్యక్తం చేయలేదు. ఇక నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షంచడానికి బీసీసీఐ పెట్టిన విధానాన్ని మేం గౌరవిస్తాం. ఈ విషయంలో ఐపీఎల్ అధికారులతో కలిసి పనిచేస్తాం'అని కేకేఆర్ ఆప్రకటనలో పేర్కొంది.

బీసీసీఐ వార్నింగ్..
కింగ్స్ పంజాబ్‌తో శనివారం ఆఖరి బంతి వరకు జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు పరుగులతో విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఉల్లాస్ గాంధీ, క్రిస్ గెఫెనీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటన విడుదల చేసింది. 'నరైన్‌ను వార్నింగ్ లిస్ట్‌లో ఉంచుతున్నాం. ప్రస్తుతం అతను బౌలింగ్ వేయవచ్చు. మరోసారి ఫిర్యాదు వస్తే మాత్రం బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు నరైన్ బౌలింగ్ వేసే అవకాశం ఉండదు' అని హెచ్చరిక జారీ చేసింది.

ఆఖరి ఓవర్‌లో అనుమానాస్పద బౌలింగ్
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ కీలకమైన రెండు వికెట్లను తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా 18, 20వ ఓవర్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ కట్టడి చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసిన సునీల్.. 28 పరుగులు ఇచ్చాడు. నికొలస్ పూరన్, మన్‌దీప్ సింగ్‌లను పెవిలియన్ పంపించగలిగాడు. అదే సమయంలో అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకూ 347 టీ20 మ్యాచ్‌లు ఆడిన నరైన్ 390 వికెట్లు తీశాడు. టీ20 లీగ్‌లో అతను 116 మ్యాచ్‌లాడి 127 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 6.74గా ఉంది. ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన నరైన్ బౌండరీలు కూడా అలవోకగా బాదగలడు.

నరైన్ ఆడకుంటే..
ఇక నరైన్ వివాదాస్పద బౌలింగ్‌పై ఫిర్యాదు నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్‌తో జరిగే నేటి మ్యాచ్‌లో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ అతను తప్పుకుంటే మాత్రం క్రిస్ గ్రీన్‌ను తీసుకోవచ్చు. భవిష్యత్తులో నరైన్ సేవలు కోల్పోయినా బ్యాకప్‌గా క్రిస్ గ్రీన్ సిద్దం చేయవచ్చు. అలాగే గాయపడ్డ ఆండ్రూ రస్సెల్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలన టామ్ బాంటన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
RCB vs KKR: సమఉజ్జీల సమరం.. కోల్‌కతాకు కోహ్లీసేన షాకిచ్చేనా? తుది జట్లు ఇవే!


Click it and Unblock the Notifications












