For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: సమఉజ్జీల సమరం.. కోల్‌కతాకు కోహ్లీసేన షాకిచ్చేనా? రికార్డులు ఏం చెబుతున్నాయి?

 IPL 2020, RCB vs KKR: Who will win Royal Challengers Bangalore vs Kolkata Knight Riders
IPL 2020, RCB vs KKR : Match Preview And Pitch Report || Oneindia Telugu

షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి పాయింట్స్ టేబుల్లో మూడు,నాలుగు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సోమవారం సాయంత్రం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రసవత్తర పోరుకు చిన్న మైదానమైన షార్జా ఆతిథ్యం ఇవ్వనుంది.

దాంతో మరో సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్ అభిమానులను కనువిందు చేయనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన ఉత్సాహంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతుండగా.. కింగ్స్ పంజాబ్‌తో స్పూర్తిదాయకమైన విజయాన్నందుకున్న కేకేఆర్ అదే జోరు కొనసాగించాలనుకుంటుంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి!

ఉత్సాహంగా కోహ్లీసేన..

ఉత్సాహంగా కోహ్లీసేన..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన మార్స్ పెర్ఫామెన్స్ జట్టుకు అద్భుత విజయాన్నందుకున్నాడు. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్‌తో టచ్‌లోకి వచ్చి కోహ్లీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ మరో క్లాస్ ఇన్నింగ్స్ ఆడితే కోల్‌కతాకు కష్టాలు తప్పవు.మరోవైపు యువ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ ఫర్వాలేదనిపిస్తున్నా.. ఫించ్ విఫలమవుతున్నాడు. ఇది ఆర్‌సీబీకి సమస్యగా మారింది. మంచి ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యత ఫించ్‌పై ఉంది. ఇక ఆరంభంలో అదరగొట్టిన డివిలియర్స్.. గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అతను తన మార్క్ పెర్ఫెమెన్స్ చూపించాల్సి ఉంది. వీరీలో ఏ ఇద్దురు చెలరేగినా ఆర్‌సీబీ బ్యాటింగ్‌కు డోకా ఉండదు.

ఇక క్రిస్ మోర్రిస్ రాకతో అటు బ్యాటింగ్ డెప్త్‌తో పాటు ఇటు బౌలింగ్ విభాగం పటిష్టమైంది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతను మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అతనికి అండగా ఇసురు ఉడానా, నవదీప్ సైనీ రాణిస్తున్నారు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు తిరుగులేదు. జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఆర్‌సీబీ ఖాతాలో మరో విజయం చేరడం ఖాయాం.

రెట్టింపైన కేకేఆర్ బలం..

రెట్టింపైన కేకేఆర్ బలం..

నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న కేకేఆర్‌‌ లీగ్‌‌లో బలమైన పోటీదారుగా మారింది. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమి నుంచి విజయాన్నందుకుంది. ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకుంది. ఇన్నాళ్లు విఫలమైన కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా టచ్‌లోకి వచ్చాడు. దీంతో ఆ జట్టు బలం రెట్టింపు అయింది. అయితే ఆండ్రూ రస్సెల్ గాయపడటం.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు వ్యక్తమవ్వడం ఆ జట్టును కొంత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రిస్క్ వద్దనుకుంటే మాత్రం రస్సెల్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం టామ్ బాంటన్ అరంగేట్రం చేయవచ్చు. అలాగే నరైన్‌కు ప్రత్యామ్నాయంగా క్రిస్ గ్రీన్ సిద్దం చేసుకోవాలనుకుంటే మిస్టర్ స్పిన్నర్ బెంచ్‌కు పరిమితం కావచ్చు.

శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి ఫామ్‌లో ఉన్నారు. వీరు మరోసారి చెలరేగితే కేకేఆర్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక కమిన్స్, నాగర్ కోటి, శివమ్ మావి, వరుణ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మార్పులు చేయాలనుకుంటే నాగర్ కోటీ స్థానంలో శివమ్ మావికి అవకాశం దక్కవచ్చు.

తుది జట్లు

తుది జట్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), గుర్‌క్రీత్ సింగ్, శివం దూబే, ఇసురు ఉడానా, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోర్రిస్, నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్/క్రిస్ గ్రీన్, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, కీపర్), ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్/టామ్ బాంటన్, రాహుల్ త్రిపాఠి, పాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి/ శివం మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

ఈ మైదానం చిన్నది కావడంతో పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. అలాగే స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. లీగ్‌లో ఇప్పటి వరకు ఇక్క ఐదు మ్యాచ్‌లు జరగ్గా నాలుగింటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఒక్క రాజస్థాన్ మాత్రమే కింగ్స్ పంజాబ్‌ను చేజింగ్‌లో ఓడించింది. ఢిల్లీ, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌ల్లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన జట్టుకే విజయం లభిస్తుంది. ఈ మైదానం ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్ ఆడకపోగా.. కోల్‌కతా ఒకే మ్యాచ్ ఆడి డీసీ చేతిలో 10 రన్స్‌తో ఓడింది. టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ చేయవచ్చు.

ముఖా ముఖి

ముఖా ముఖి

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగ్గా 14-10తో కోల్‌కతానే పై చేయి సాధించింది. చివరగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు కోల్‌కతానే గెలిచింది. ఇక గత సీజన్‌‌లో మాత్ర చెరొక విజయాన్నందుకున్నాయి. 2014లో యూఏఈల జరిగిన ఏకైక మ్యాచ్‌లో కూడా కేకేఆరే గెలుపొందింది.

కేఎల్ రాహుల్ ట్రేడ్ మార్క్ సెంచరీ సెలబ్రేషన్‌కు అర్థం తెలుసా? ఆ చాట్ షోనే కారణం!

Story first published: Monday, October 12, 2020, 18:06 [IST]
Other articles published on Oct 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+