అతన్ని మూడో స్థానంలో పంపితే డబుల్ సెంచరీ చేయగలడు: కేకేఆర్ మెంటార్ డేవిడ్ హస్సీ

దుబాయ్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ పంపితే డబుల్ సెంచరీ చేయగలడని ఆ జట్టు మెంటార్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ హస్సీ అభిప్రాయపడ్డాడు. కరోనా ఆటంకాలను దాటుకొని ప్రేక్షకులను అలరించేందుకు క్యాష్ రిచ్ లీగ్ సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఆదివారమే ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన డేవిడ్ హస్సీ.. తమ జట్టు సన్నాహకాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

రస్సెల్‌తో ఏదైనా సాధ్యమే..
ఫినిషర్ పాత్రలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే రస్సెల్.. మరిన్ని బంతులు ఎదుర్కొంటే టీ20 ఫార్మాట్‌లో ఎవరికి సాధ్యం కానీ డబుల్ సెంచరీని సుసాధ్యం చేస్తాడని ఈ కేకేఆర్ మెంటార్ చెప్పుకొచ్చాడు. ‘జట్టు విజయాలకు ఉపయోగపడుతాడంటే అతన్ని మూడో స్థానంలో ఎందుకు పంపించం? అతను కనుక ఫస్ట్ డౌన్‌లో వచ్చి 60 బంతులు ఆడితే డబుల్ సెంచరీ సాధించగలడు. రస్సెల్‌తో ఏదైనా సాధ్యమవుతుంది'అని హస్సీ మీడియా కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.

కేకేఆర్ గుండెకాయ రస్సెల్..
ఇక రస్సెల్ కేకేఆర్ గుండెకాయని, తమకు సమతూకమైన జట్టు ఉందని చెప్పుకొచ్చాడు. ‘అద్భుత ఆటగాడైన రస్సెల్.. కేకేఆర్ గుండెకాయ. మాకు సమతూకమైన జట్టు ఉంది. ప్రతీ ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. జట్టుకు లాభం చేకూర్చుతుందంటే రస్సెల్‌ను టాపార్డర్‌లో ఆడిస్తాం'అని హస్సీ స్పష్టం చేశాడు. ఇక గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన రస్సెల్.. 13 ఇన్నింగ్స్‌ల్లో 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు. ఓడిపోయే మ్యాచ్‌లను తన సునామీ ఇన్నింగ్స్‌లతో గెలిపించాడు.

మెక్‌కల్లమ్ పర్యవేక్షణలో..
ఇక కేకేఆర్ ఈ సీజన్‌లో కోచింగ్ స్టాఫ్‌ను మార్చేసింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ హెడ్ కోచ్‌గా.. బౌలింగ్ కోచ్‌గా కైల్ మిల్స్‌లను నియమించింది. అయితే మెక్‌కల్లమ్ పర్యవేక్షణలో కేకేఆర్ అత్యుత్తమ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగుతుందని హస్సీ తెలిపాడు. ‘మెక్‌కల్లమ్ గురించి తెలిసిన ఎవరికైనా అతను గంటకు 100 మైళ్ల వేగంతో ఆడుతాడని తెలుసు. ప్రతిభ కలిగిన ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లు ఎవరో అతని ఇట్టే పసిగట్టగలడు. అలాంటి ఆటగాళ్లు మా జట్టులో చాలా మంది ఉన్నారు.'అని హస్సీ చెప్పుకొచ్చాడు.

కార్తీక్, మోర్గాన్ నేతృత్వంలో..
ఇక ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. దినేశ్ కార్తీక్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడని తెలిపిన హస్సీ.. ఈ ఇద్దరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నాడు. ‘ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా.. సుదీర్ఘ కాలం ఇంగ్లండ్‌ను నడిపిస్తున్న సారథిగా మోర్గాన్‌కు మంచి పేరుంది. అతనో క్లాస్ ప్లేయర్, క్లాస్ పెర్ఫామర్. అతని అనుభవం దినేశ్ కార్తీక్‌కు సాయంగా నిలవనుంది. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో.. బౌలర్లను ఉపయోగించే సమయంలో తోడుగా ఉంటాడు. అతను చాలా ప్రశాంతమైన వ్యక్తి. మిడిలార్డర్‌లో సత్తాచాట గలిగే ఆటగాడు. కార్తీక్, మోర్గాన్ మధ్య సంబంధం బాగుంది. ఈ టోర్నీలో కేకేఆర్ గట్టి పోటీనివ్వనుంది.'అని డేవిడ్ హస్సీ తెలిపాడు.ఇక కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా సెప్టెంబర్ 23న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
జోఫ్రా ఆర్చర్ దెబ్బకు.. డేవిడ్ వార్నర్‌కు దేవుడు గుర్తొచ్చాడు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications