Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kings XI Punjab పంజా విసురుతుందా.. జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!

Kings XI Punjab: Strength, Weakness, Top Players List

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఉన్న పేరు అండర్ డాగ్స్‌! స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 12 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ రాజ్యాన్ని ఏలేలా కనిపిస్తోంది.! కొత్త కెప్టెన్ లోకేశ్ రాహుల్.. నూతన కోచ్ అనిల్ కుంబ్లే‌తో ఆ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఈ ఇద్దరికి తోడు టాప్ క్లాస్ మ్యాచ్ విన్నర్లతో అసలు సిసలు జట్టును తలపిస్తున్న కింగ్స్ పంజాబ్.. ఈ సారైనా పంజా విసురుతోందో లేదో చూడాలి.

లోపాలను సరిదిద్దుకొని..

లోపాలను సరిదిద్దుకొని..

గత రెండు సీజన్లను ఘనంగా ప్రారంభించినా.. పాయింట్ల పట్టికలో మాత్రం చివరి‌‌‌ ప్లేస్‌‌‌‌తోనే లీగ్‌‌‌‌ను ముగించింది. అయితే 2020 వేలంలో దాదాపు అన్ని సమస్యలను పరిష్కరించుకుని ఈసారి లీగ్‌‌‌‌కు సరికొత్తగా సిద్దం అవుతుంది. విదేశీ ఆటగాళ్లతో పాటు డొమెస్టిక్‌‌‌‌ లెవెల్లో ఓ స్థాయిలో ఆడిన భారత యువ ఆటగాళ్ల‌‌‌తో జట్టు‌‌‌ను పటిష్టం చేసుకుంది. గత‌‌‌ సీజన్లలో కెప్టెన్‌‌‌‌గా ఉన్న స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్ అశ్విన్‌‌‌‌ను పూర్తిగా వదిలేసి.. టీమిండియా టాప్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌కు సారథ్యం అప్పగించింది.

కోచింగ్‌‌‌ సిబ్బంది‌‌‌ విషయంలోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇండియన్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ బ్రెయిన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుంబ్లేను చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా తీసుకుంది. దీంతో ఈ కర్ణాటక కాంబో కచ్చితంగా అద్భుతాలు చేస్తారని ఫ్రాంచైజీ నమ్ముతోంది.

బలం, బలగం..

బలం, బలగం..

ప్రస్తుత పంజాబ్ జట్టు చూస్తే తిరుగేలదనిపిస్తుంది. బ్యాటింగ్‌‌‌‌లో కేఎల్ రాహుల్‌‌‌‌, క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌.. ధనాధన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు సరిపోయే ఆటగాళ్లు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ముఖ్యంగా డేంజరస్‌‌‌‌ గేల్‌‌‌‌ ఈసారి మరింత కసితో కనిపిస్తున్నాడు. కెప్టెన్‌‌‌‌గా అదనపు ఒత్తిడి ఉన్నా.. రాహుల్‌‌‌‌ ఫామ్‌‌‌‌కు వచ్చిన ఇబ్బందేమి లేదు. నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌తో టాపార్డర్‌‌‌‌ మరింత బలంగా కనిపిస్తోంది.

పది ఓవర్లు వీళ్లు చూసుకుంటే తర్వాత మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, నీషమ్‌‌‌‌ ఆడుకుంటారు. మ్యాక్సీ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్‌‌‌‌లో షమీ, షెల్డన్‌‌‌‌ కాట్రెల్‌‌‌‌ ప్రధాన ఆయుధాలు. ఓపెనింగ్‌‌‌‌, డెత్‌‌‌‌ ఓవర్లలో వీరిద్దరే చాలా ముఖ్యం. డొమెస్టిక్‌‌‌‌ సీజన్‌‌‌‌లో అదరగొట్టిన ఇషాన్‌‌‌‌ పోరెల్‌‌‌‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే టాలెంటెడ్​ప్లేయర్లు ఎక్కువగా ఉండటంతో ఎవర్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకుంటారన్నదే కీలకం కానుంది.

బలహీనత..

బలహీనత..

ఒకరిద్దరు స్టార్‌‌‌‌ ప్లేయర్ల మీద జట్టు ఆధారపడటం పంజాబ్‌‌‌‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. వ్యక్తిగతంగా ప్రతి ప్లేయర్‌‌‌‌ స్టార్‌‌‌‌గా కనిపిస్తున్నా.. సమష్టిగా రాణించడంలోనే పంజాబ్‌ గత సీజన్లలో‌‌‌ విఫలమైంది. పరస్పరం మద్దతు‌‌‌ ఇచ్చుకోలేక.. కీలక సమయంలో ప్లేయర్లు తడబడుతున్నారు. ఇది అతిపెద్ద బలహీనతగా మారింది. కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌, మన్‌‌‌‌దీప్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడా, కృష్ణప్ప గౌతమ్‌‌‌‌ వంటి సీనియర్లు ఉన్నా వారిపై పూర్తిగా నమ్మకం ఉంచలేని పరిస్థితి. బౌలింగ్‌‌‌‌లో షమీ, కాట్రెల్‌‌‌‌కు అండగా నిలిచే వారు లేకపోవడం లోటు. భారీగా వెచ్చించి తెచ్చుకున్న అండర్-19 ప్లేయర్ రవి బిష్ణోయ్‌‌‌‌ ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాక్స్‌వెల్ వచ్చే వరకు మిడిలార్డర్‌‌‌‌ను నడిపించే వారు ఎవరనేది కూడా తేలాల్సి ఉంది.

అంచనా..

అంచనా..

టాప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ విన్నర్లు ఉన్నారు కాబట్టి ప్లే ఆఫ్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఉంది. వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ప్లేయర్లందరూ అంచనాలను అందుకుంటే పంజాబ్‌‌‌‌ను కచ్చితంగా ప్లే ఆఫ్స్‌‌‌‌లో చూడొచ్చు. అయితే వీళ్లకు యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ కూడా తోడుగా నిలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న. ఈనెల 20న ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌తో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌తో పంజాబ్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌ జర్నీని మొదలుపెడుతుంది.

కింగ్స్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ పంజాబ్‌‌‌‌ టీమ్‌‌‌‌

కింగ్స్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ పంజాబ్‌‌‌‌ టీమ్‌‌‌‌

బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌: క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌, మన్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌

ఆల్‌‌‌‌రౌండర్స్‌‌‌‌: దీపక్‌‌‌‌ హుడా, గ్లేన్ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, జేమ్స్‌‌‌‌ నీషమ్‌‌‌‌, కృష్ణప్ప గౌతమ్‌‌‌‌, తజిందర్‌‌‌‌ సింగ్‌‌‌‌

వికెట్‌‌‌‌ కీపర్స్‌‌‌‌: కేఎల్ రాహుల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌, ప్రభ్​సిమ్రన్​సింగ్‌‌‌‌

బౌలర్లు: అర్షదీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, క్రిస్‌‌‌‌ జోర్డాన్‌‌‌‌, దర్శన్‌‌‌‌ నల్కాండే, హర్డస్‌‌‌‌ విల్జోన్‌‌‌‌, హర్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బ్రార్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ పోరెల్‌‌‌‌, మహ్మద్ షమీ, జగదీశ సుచిత్‌‌‌‌, ముజిబ్ ఉర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌, మురుగన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌, షెల్డన్‌‌‌‌ కాట్రెల్‌‌‌‌.

England vs Australia: వారెవ్వా వాటే ఫీల్డింగ్ స్టోయినిస్.. కళ్లు చెదిరే రనౌట్! (వీడియో)

Story first published: Monday, September 14, 2020, 14:43 [IST]
Other articles published on Sep 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+