Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన కీరన్ పొలార్డ్!

Kieron Pollard inadvertently uses saliva on ball in CPL 2020 final

ట్రినిడాడ్: కరోనా వైరస్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతావలయంలో జరిగిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) 2020 సీజన్ సక్సెస్‌ఫుల్ ముగిసింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ చాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో పరాజయమనేదే లేకుండా సాగిన ఈ జట్టు వరుసగా 12వ మ్యాచ్‌ గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్‌ లూసియా జూక్స్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడు.

బంతిపై ఉమ్మి రుద్ది...

బంతిపై ఉమ్మి రుద్ది...

కరోనా నేపథ్యంలో బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ తాత్కలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మరిచిపోయిన పొలార్డ్ అలావాటులో పొరపాటుగా బంతిపై సెలైవా ఉపయోగించాడు. సెయింట్ కింట్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ చివరి బంతికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది టీవీ కెమెరాలకు చిక్కడంతో అంపైర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. సానిటైజింగ్ వైప్స్ తెచ్చి బంతిని శుభ్రం చేశారు. నిబంధనల ప్రకారం పొలార్డ్‌ను ఓ మందలింపుతో వదిలిపెట్టారు.

5 పరుగుల పెనాల్టీ..

5 పరుగుల పెనాల్టీ..

ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఐసీసీ బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దడాన్ని నిషేధిస్తూ... మైదానంలో ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోవడం, భౌతిక దూరం పాటించడం, అలానే వికెట్ పడిన సమయంలో హైఫై‌లు ఇచ్చుకోవడం వంటివాటికి దూరంగా ఉండాలని సూచించింది. అలవాటులో పొరపాటుగా ఏ బౌలరైనా బంతిపై ఉమ్మి రుద్దితే.. తొలుత హెచ్చరించాలని, అయినా మళ్లీ అదే చేస్తే ఆ బౌలర్ జట్టు‌కు 5 పరుగులు జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొంది. దీంతో అంపైర్లు పొలార్డ్‌ను హెచ్చరించి వదిలేశారు. కానీ అతను ఉమ్మి రుద్దడానికి సంబంధించి ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

బౌలర్లు తరుచూ..

బౌలర్లు తరుచూ..

ఇక ఐసీసీ ఇంత కఠినంగా చెప్పిన ఆటగాళ్లు అలవాటులో బంతి ఉమ్మి రుద్దుతూనే ఉన్నారు. వెస్టిండీస్‌తో ఫస్ట్ టెస్ట్ సందర్భంగా డామ్ సిబ్లీ, ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమిర్ బంతిపై సెలెవా రుద్దుతూ కెమెరాలకు చిక్కారు. అయితే వీరిపై అంపైర్లు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలింపుతో వదిలేశారు. మహ్మద్ అమిర్ అయితే పలుమార్లు బంతిపై ఉమ్మి రుద్దాడాన్ని, కానీ అంపైర్లు పట్టించుకోలేదనే విమర్శలు వినిపించాయి.

 నాలుగో సారి..

నాలుగో సారి..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూసియా జూక్స్‌ 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ ఫ్లెచర్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) టాప్‌స్కోరర్‌గా నిలవగా...కీరన్‌ పొలార్డ్‌ (4/30) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం నైట్‌రైడర్స్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది.

లెండిన్‌ సిమన్స్‌ (49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్‌ ), డారెన్‌ బ్రావో (47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 58 నాటౌట్‌) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 88 బంతుల్లో అభేద్యంగా 138 పరుగులు జోడించారు. ట్రినిడాడ్‌ జట్టు సీపీఎల్‌ టైటిల్‌ గెలవడం నాలుగో సారి కావడం విశేషం. అంతకుముందు 2015, 2017, 2018 సీజన్లలోనూ ట్రిన్‌బాగో టైటిల్స్‌ గెలిచింది.

ఈ మ్యాచ్ గుర్తుందా.. ఆర్‌సీబీ అత్యుత్సాహం.. సీఎస్‌కే అద్భుత విజయం!

Story first published: Friday, September 11, 2020, 10:42 [IST]
Other articles published on Sep 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+