Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: తండ్రి కల జిమ్నాస్ట్.. తల్లి కోరిక క్రికెటర్.. ఫైనల్‌గా కొడుకు ఇలా!

Kevin Sinclair does a dangerous somersault after taking the wicket of Mitchell Santner in CPL 2020

ట్రినిడాడ్: మైదానంలో సెంచరీ చేసినా.. వికెట్ తీసినా.. క్యాచ్ పట్టినా ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు జరుపుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తారు. ఒకరు నోట్‌బుక్ సెలెబ్రేషన్ చేసుకుంటే మరొకరు.. సెల్యూట్ చేస్తారు. ఇంకొకరు గంగ్నమ్ డ్యాన్స్‌తో చిందేస్తారు. ఈ తరహాలోనే విండీస్ ఆల్‌ రౌండర్ కెవిన్ సింక్లెయిర్ జిమ్నాస్ట్ విన్యాసాలతో సందడి చేస్తాడు.

ట్రిపుల్ జంప్‌తో..

ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో.. గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్న కెవిన్ సింక్లెయిర్.. వికెట్ తీసిన ఆనందంలో ఎన్నోసార్లు జిమ్నాస్టిక్ విన్యాసాలతో అబ్బూరపరిచాడు. తాజాగా బార్బడోస్ ట్రిడెంట్స్‌తో గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో కూడా కెవిన్ సింక్లెయిర్ మరోసారి తన జిమ్నాస్ట్ విన్యాసాలతో ఔరా అనిపించాడు. కాకపోతే ఈసారి ప్రమాదకర విన్యాసం చేశాడు. బార్బడోస్ ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌ ఐదో బంతికి ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్ మిచెల్ సాంట్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సింక్లెయిర్ ఆ అనందంలో ఎగిరి గంతేశాడు. తన ట్రిపుల్ జంప్‌తో ఆకట్టుకున్నాడు.

ట్రిపుల్‌తో బుబుల్‌కు ట్రబులే..

ట్రిపుల్‌తో బుబుల్‌కు ట్రబులే..

దీనికి సంబంధించిన వీడియోను ‘డబుల్? ట్రెబుల్? ఖచ్చితంగా బబుల్‌కు ట్రబులే.. వాటే సెలెబ్రేషన్'అనే క్యాప్షన్‌తో సీపీఎల్ టీ20 అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన అభిమానులు సింక్లెయిర్ చిన్నప్పుడు ఎమైనా స్రింగులు మింగాడా అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరమే.. ‘తండ్రి కల జిమ్నాస్ట్ తల్లి కోరిక క్రికెటర్.. ఫైనల్‌గా కొడుకు సింక్లెయిర్ ఇలా'అని సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సెమీఫైనల్ బెర్త్..

సెమీఫైనల్ బెర్త్..

కాగా ఈ మ్యాచ్‌లో తొలతు బ్యాటింగ్ చేసిన బార్బ‌డోస్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 89 ప‌రుగులే చేసింది. 90 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్ 15 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో లీగ్‌లో రెండోస్థానానికి చేరుకున్న గ‌యానా వారియ‌ర్స్ సెమీఫైన‌ల్ బెర్త్ ఖ‌రారు చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే న‌మోదు చేసిన డిపెండింగ్ చాంపియ‌న్ బార్బ‌డోస్ ట్రిడెంట్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి రెండో స్థానంలో నిలిచి లీగ్ నుంచి నిష్క్ర‌మించింది.

రషీద్ ఖాన్ ఇమిటేట్..

రషీద్ ఖాన్ ఇమిటేట్..

ఇదే బార్బడోస్ ట్రిడెంట్స్‌తో గత మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కెవిన్ సింక్లెయిర్.. వికెట్ తీసిన ఆనందంలో జిమ్నాస్టిక్ విన్యాసాలతో అబ్బూరపరచగా..రషీద్ ఖాన్ ఇమిటేట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో సింక్లెయిర్(3) వికెట్ తీసిన రషీద్ ఖాన్.. అదే రితిలో జిమ్నాస్టిక్ విన్యాసాలను ఇమిటేట్ చేస్తూ బదులిచ్చాడు.

IPL 2020 టైమింగ్స్ మార్చండి గంగూలీ సర్.. 7.30కి మా ఫ్యామిలీ ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తుంది!

Story first published: Friday, September 4, 2020, 20:34 [IST]
Other articles published on Sep 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+