
రుణపడి ఉంటా..
ఇక కేసీఏ నిర్ణయం పట్ల శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ అవకాశం పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, కేసీఏకు రుణపడి ఉంటానని తెలిపాడు. ‘ఈ అవకాశం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నా. రంజీ ట్రోఫీ ఆడే అవకాశం ఇస్తున్న కేసీఏకు నేను రుణపడి ఉంటా. నా ఫిట్‌నెస్ నిరూపించుకోని పునరాగమనం చేస్తా. అన్ని వివాదాలు సమసిపోయి మంచి రోజుల వస్తాయిని ఆశిస్తున్నా.'అని ఈ కేరళ పేసర్ చెప్పుకొచ్చాడు.

మరింత బలం పెరుగుతుంది..
టీమిండియా మాజీ బౌలర్ టిను యోహనాన్‌ను కేసీఏ ఇటీవల జట్టు కోచ్‌గా నియమించింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. శ్రీశాంత్ పునరాగమనంతో జట్టుకు మరింత బలం చేకూరుతుందని వ్యాఖ్యానించాడు. అయితే శ్రీశాంత్ పునరాగమనం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అతని ఆటను చూసే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ నిషేధం ఎప్పుడెప్పుడు ముగుస్తుందా.. అని ఎదురు చూస్తున్నామని కేసీఏ సెక్రటరీ శ్రీజిత్ నాయర్ తెలిపారు. శ్రీ జట్టులోకి వస్తే అతని అనుభవం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ఫిక్సింగ్..
2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లపై బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే దీనిపై శ్రీశాంత్ న్యాయపోరాటం చేయడంతో.. గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టు బోర్డు నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఈ కేసు 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది.

ఏడేళ్లకు కుదించడంతో..
ఇక 2019 ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు.
స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు.
పృథ్వీషా పెద్ద మనసు.. రాకాసి ధాటికి గూడు చెదిరిన పేదల కోసం..


Click it and Unblock the Notifications












