Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్: కృష్ణప్ప గౌతమ్

Karnataka all-rounder Krishnappa Gowtham Says Rohit Sharma a better IPL captain than Virat Kohli

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కన్నా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ అని స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అన్నాడు. ఐపీఎల్‌లో తనదైన ఆటతో అభిమానులకు సుపరిచితమైన ఈ కర్ణాటక ఆల్‌రౌండర్.. తాజాగా క్రిక్ ట్రాకర్ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన 31 ఏళ్ల గౌతమ్‌కు ఇరకాటంలో పడేసే ప్రశ్న ఎదురైంది.

రోహిత్ బెస్ట్.. ధోనీ ఫైనెస్ట్

రోహిత్ బెస్ట్.. ధోనీ ఫైనెస్ట్

క్యాష్ రిచ్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లు ధోనీ, రోహిత్.. స్పూర్తిదాయకమైన ఆటతో ఆకట్టుకునే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నించగా.. సమాధానం చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇక చివరకు కోహ్లీ, రోహిత్‌లలో హిట్‌మ్యానే గొప్ప సారథని బదులిచ్చాడు. ‘నేనైతే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ అంటా.. ఎందుకంటే అతని సారథ్యంలో నేను ఆడా. మేం ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచాం'అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ టీ20 లీగ్‌లో ధోనీనే ఫైనెస్ట్ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు.

రసెల్ కన్నా ఏబీడీనే..

రసెల్ కన్నా ఏబీడీనే..

ఇక సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రూ రసెల్‌లో తనకు మిస్టర్ 360నే ఎక్కువ ఇష్టమని తెలిపాడు. ‘గత రెండుళ్లుగా రసెల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతనో భయంకరమైన ఆటగాడు. ఓ సారి నేను అతన్ని ఇంటర్వ్యూ కూడా చేశాను. విధ్వంసకరమైన తన ఆటతో అతన్ని మృగం అని పిలిచాను. అదే అతనికి సరిపోయే పేరు. కానీ ఏబీడీ ఏ సమయంలోనైనా ఆటను మార్చగలిగే శక్తి ఉన్నవాడు. అతని ఆసాధారణ ఆటతో జట్టుకు కావాల్సిన శక్తిని ఇచ్చేవాడు. అందుకే నేను ఏ రోజైనా.. ఏబీడినే అభిమానిస్తా. అతనే నా గొప్ప బ్యాట్స్‌మన్'అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.

22 మ్యాచ్‌లు 12 పరుగులు

22 మ్యాచ్‌లు 12 పరుగులు

ఇక కొంత మంది క్రికెటర్ల గురించి సింగిల్ వర్డ్‌లో చెప్పమనగా.. కోహ్లీ-మిస్టర్ కన్సిస్టెంట్, ధోనీ కెప్టెన్ అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గౌతమ్.. 2020 సీజన్‌లో మాత్రం కింగ్స్ పంజాబ్‌కు ఆడనున్నాడు. ఇక తన 22 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో 12 వికెట్లు తీసిన గౌతమ్ 144 రన్స్ చేశాడు. గత రెండు సీజన్లు రాజస్థాన్‌కు ఆడిన కృష్ణప్ప.. 2017లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం దక్కలేదు.

పంజాబ్ కాదు.. అది కన్నడ జట్టే..

పంజాబ్ కాదు.. అది కన్నడ జట్టే..

ఇక ప్రస్తుత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో కన్నడ ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారని, అది ఓ చిన్న కన్నడ జట్టని గౌతమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘పంజాబ్ జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జట్టులో మొత్తం ఐదుగురు కన్నడ ఆటగాళ్లు ఉన్నారు. దాదాపు ఇది మినీ కన్నడ జట్టు. నీతో ఎప్పుడూ ఆడే ఆటగాళ్లలో ఐదుగురు మళ్లీ నీతోనే కలిసి ఆడే పరిస్థితులు ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.'అని కృష్ణప్ప గౌతమ్ చెప్పుకొచ్చాడు.

అందుకే కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకోలేదు: ఐపీఎల్ మాజీ సీఓఓ

Story first published: Friday, June 26, 2020, 14:11 [IST]
Other articles published on Jun 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+