అందుకే కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకోలేదు: ఐపీఎల్ మాజీ సీఓఓ

న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని యువ భారత్ 2008 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభ సీజన్ వేలానికి నెల రోజుల ముందు జరిగిన ఈ టోర్నీలో యువ భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన కోహ్లీ.. యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. తనదైన సారథ్య ప్రతిభతో పాటు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ గెలుపుతో ప్రారంభ ఐపీఎల్ సీజన్‌లో ఈ ఢిల్లీ ఆటగాడు ఆడటం ఖాయమని అందరూ భావించారు.

కోహినూర్‌లాంటి కోహ్లీని కాదని..
అయితే తన సొంత నగరానికి చెందిన ఢిల్లీ డేర్ డెవిల్స్‌కే ఆడుతాడుకున్నారు. కానీ ఢిల్లీ ఫ్రాంచైజీ కోహినూర్ వజ్రంలాంటి కోహ్లీని కాదని బౌలర్ ప్రదీప్ సంగ్వాన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ బంగారం లాంటి అవకాశాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం వదులుకోలేదు. ఇక ఆర్సీబీ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న విరాట్.. అంచెలంచెలుగా ఎదుగుతూ జట్టు కెప్టెన్సీతో పాటు భారత జట్టును నడిపించే స్థాయికి ఎదిగాడు. కానీ సొంత నగరానికి చెందిన కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎందుకు వదులుకుందో ఎవరికి అంతుపట్టలేదు. ఇప్పటికి ఎవరికీ తెలియదు.

బ్యాట్స్‌మన్ అవసరం లేకనే..
అయితే ఐపీఎల్ మాజీ సీఓఓ సుందర్ రామన్ కోహ్లీని ఢిల్లీ కొనుగోలు చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించాడు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ ‘22 యార్న్స్'షోలో మాట్లాడుతూ.. ఢిల్లీకి మరో బ్యాట్స్‌మన్ తీసుకునే ఉద్దేశం లేకనే కోహ్లీని వదులుకుందన్నాడు. అందుకే కోహ్లీని కాదని బౌలర్ ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకుందని తెలిపాడు.
‘ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ ఏడాది భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. సరిగ్గా ఐపీఎల్ వేలానికి నెలరోజుల ముందే ఆ టోర్నీ జరిగింది. కోహ్లీ సారథ్యంలోనే జట్టే విశ్వవిజేతగా నిలిచింది. దీంతో వేలం జరిగిన తర్వాత అండర్-19 ఆటగాళ్లతో కూడిన ప్రత్యేకమైన డ్రాఫ్ట్‌ను సిద్దం చేశాం. సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఆ డ్రాఫ్ట్ నుంచి ఎంపికైన తొలి ఆటగాడు కోహ్లీ కాకపోవడం.

ఢిల్లీ నిర్ణయం సరైందే..
ఢిల్లీ అతన్ని కాదని, ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకుంది. ఎందుకంటే వారికి మరో బ్యాట్స్‌మన్ అవసరం లేదని చెప్పింది. వాస్తవానికి సెహ్వాగ్, డివిలియర్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు వారి జట్టులో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వారు సరిగ్గానే ఆలోచించారు. కానీ ఆర్సీబీ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే'అని సుందర్ రామన్ చెప్పుకొచ్చాడు.

అత్యధిక పరుగుల వీరుడు..
ఇక క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటి వరకు 169 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్.. 37 సగటుతో 5412 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక కోహ్లీ బదులు ఢిల్లీకి ఎంపికైన సంగ్వాన్ కేవలం 39 మ్యాచ్‌లకే పరిమితమై 35 వికెట్లు పడగొట్టాడు. డొప్ టెస్ట్‌లో పట్టుబడిన సంగ్వాన్‌పై బీసీసీఐ 15 నెలల నిషేధం విధించడంతో అతని కెరీర్ ముగిసిపోయింది. 2011లోనే సంగ్వాన్ ఢిల్లీ జట్టును వీడాడు. ఇక కోహ్లీ మాత్రం గత 12 ఏళ్లుగా ఆర్సీబీకే ఆడుతున్నాడు.
ఆరోజు డివిలియర్స్ లేకుంటే టీ20ల్లో డబుల్ సెంచరీ నమోదయ్యేది: క్రిస్ గేల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications